For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్‌లో సౌదీ అరేబియా మరిన్ని పెట్టుబడులు, ఆర్థికవ్యవస్థ బౌన్స్ బ్యాక్

|

ఢిల్లీ: భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టాలనే తమ నిర్ణయం మేరకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని సౌదీ అరేబియా వెల్లడించింది. కరోనా వైరస్ సంక్షోభం వల్ల తలెత్తిన ప్రతికూల ప్రభావం నుండి భారత్ అత్యంత త్వరగా కోలుకుంటుందని అభిప్రాయపడింది. దేశంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని ఫిబ్రవరిలో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. పెట్రో కెమికల్స్-శుద్ధి, మౌలిక వసతులు, మైనింగ్, ఉత్పత్తి, వ్యవసాయం వంటి తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఆసక్తి వ్యక్తం చేసింది.

అప్పుడు మిస్ అయ్యారా.. మరోసారి భారీ ఆఫర్స్, డీల్స్అప్పుడు మిస్ అయ్యారా.. మరోసారి భారీ ఆఫర్స్, డీల్స్

వ్యూహాత్మక భాగస్వామి

వ్యూహాత్మక భాగస్వామి

భారత దేశాన్ని వ్యూహాత్మక భాగస్వామిగా, విలువైన మిత్రుడిగా పేర్కొంది సౌదీ అరేబియా. ఉగ్రవాదంపై పోరు, రక్షణ, భద్రతా రంగాల్లో విలువైన భాగస్వామిగా పేర్కొంది. భారత్ తన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి తీసుకున్న చర్యలను సౌదీ అరేబియా రాయబారి డాక్టర్ సౌద్ బిన్ మహ్మద్ అల్ సతి అన్నారు. పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై భారత్‌తో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న మైత్రిని మున్ముందు మరింత బలోపేతం చేసుకునేందుకు కృషి చేస్తామన్నారు.

ఈ దేశాలు కూడా అభివృద్ధి

ఈ దేశాలు కూడా అభివృద్ధి

కరోనా నేపథ్యంలో ఈ సంక్షోభం నుండి బయటపడేందుకు భారత ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన పథకాలని అభినందించారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, దక్షిణాసియాలో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న భారత్ వేగంగా కోలుకుంటోందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాలు ఆర్థికంగా కోలుకున్న కొద్ది ఈ ప్రాంతంలోనే ఇతర దేశాలు కూడా లబ్ధి పొందుతాయన్నారు. ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటు ద్వారా రక్షణ, భద్రత, ఉగ్రవాద నిర్మూలన, పునరుత్పాదక ఇంధన వనరుల వంటి అంశాల్లో సహకారం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పెట్టుబడులు

పెట్టుబడులు

సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్(పీఐఎఫ్) నుండి రిలయన్స్ రిటైల్‌లో 1.3 బిలియన్ డాలర్లు, జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆల్ సతి గుర్తు చేశారు. భారత ఇంధన రంగంలో సౌదీ ఆరామ్‌కో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపింది. మరిన్ని కొత్త అవకాశాల కోసం శోధిస్తున్నట్లు తెలిపారు.

English summary

భారత్‌లో సౌదీ అరేబియా మరిన్ని పెట్టుబడులు, ఆర్థికవ్యవస్థ బౌన్స్ బ్యాక్ | India's economy will improve, our investment plans there on track: Saudi Arabia

Saudi Arabia, the world's largest oil exporter, on Sunday said its investment plans in India are on track, noting that the Indian economy has the strength to recover from the adverse impact of the coronavirus crisis.
Story first published: Monday, December 21, 2020, 13:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X