For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

India Plan: చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భారత్ వ్యూహం.. 100 లక్షల కోట్ల మెగా ప్లాన్.. ఇక చుక్కలే..

|

India Plan: ప్రస్తుతం ఉన్నది నవభారతం. ప్రపంచ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతోంది. చైనా నుంచి ఫ్యాక్టరీలను లాక్కోవటానికి భారత్ భారీ వ్యూహాన్ని అమలు చేయబోతోంది. ప్రధాని మోదీ ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 లక్ష్యం అదే..

లక్ష్యం అదే..

ఈ పోర్టల్ పెట్టుబడిదారులు, కంపెనీలకు ప్రాజెక్ట్‌ల రూపకల్పన, ఆమోదాల విషయంలో ఖర్చులను భారీగా తగ్గించే వన్ స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది. సమయాన్ని ఆదా చేయటంతో పాటు వ్యయాన్ని తగ్గిస్తూ ప్రాజెక్టులను అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని లాజిస్టిక్స్ ప్రత్యేక కార్యదర్శి అమృత్ లాల్ మీనా తెలిపారు. తద్వారా భారతదేశాన్ని గ్లోబల్ కంపెనీలు తయారీ కేంద్రంగా ఎంచుకునేలా చేయటం లక్ష్యమని అన్నారు.

 చైనాతో పోటీపడేందుకు..

చైనాతో పోటీపడేందుకు..

ప్రస్తుతం అనేక కంపెనీలు చైనాతో పాటు మరో దేశంలో తమ ప్లాంట్లను పెట్టాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ ఆసియాలో చౌక కార్మికులు, ఇంగ్లీష్ మాట్లాడే ఉద్యోగులు, లాజిస్టిక్స్, సరఫరా వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలను అందిస్తోంది. చైనాతో పోటీపడటానికి ఇది ఏకైక మార్గంగా ఉంది. గతి శక్తి ద్వారా దేశంలోని నలుమూలలకు వస్తువులు, ఇతర తయారీ భాగాల రవాణాను సులభతరం చేయటమే. తాజాగా భారత ప్రభుత్వం లాజిస్టిక్స్ పాలసీని కూడా తీసుకురావటం ఇందుకు మరింతగా దోహదపడుతుంది.

 లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌..

లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌..

ఉత్పత్తి క్లస్టర్‌లకు రైల్వే నెట్‌వర్క్, పోర్ట్‌లు, విమానాశ్రయాలకు లింక్ చేయడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య స్తంభాలు. గతిశక్తి క్షేత్ర స్థాయిలో నోడ్‌లను కనెక్ట్ చేసే లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతో రూపొందించబడింది. గతి శక్తి పోర్టల్ ప్రస్తుతం 1,300 ప్రాజెక్టులను పర్యవేక్షిస్తోంది. వీటిని ముందుకు తీసుకెళ్లటంలో అటవీ, పర్యావరణ, భూ సేకరణ వంటి సమస్యలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నింటిని పోర్టల్ పరిష్కరించింది.

చైనా TO ఇండియా..

చైనా TO ఇండియా..

ప్రస్తుతం ఐఫోన్ 14 తయారీని భారత్ లో చేపట్టాలని ఆపిల్ కంపెనీ యోచిస్తోంది. 2018లో శాంమ్ సంగ్ కంపెనీ తన మెుబైల్ తయారీ యూనిట్ ను మన దేశంలో ప్రారంభించింది. ప్రస్తుతం ఓలా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీని స్థానికంగా నిర్మిస్తామని తెలిపింది. అలాగే అనేక ఇతర రంగాల్లోని కంపెనీలు ప్రస్తుతం భారత దేశంలో పెట్టుబడులను, తయారీ యూనిట్లను పెడుతున్నాయి. వీటికి అవసరమైన అన్ని సదుపాయాలను భారత ప్రభుత్వం వేగంగా సమకూర్చుతోంది.

English summary

India Plan: చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న భారత్ వ్యూహం.. 100 లక్షల కోట్ల మెగా ప్లాన్.. ఇక చుక్కలే.. | India planning to snatch factories from China with its 1.2 trillion dollar mega plan

India planning to snatch factories from China with its 1.2 trillion dollar mega plan
Story first published: Monday, October 3, 2022, 13:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X