భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలో మొదటిసారి ఆర్థిక మాంద్యంలోకి అడుగు పెడుతోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ నేపథ్యంలో వరుసగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు క్షీణించిందని, దీని అర్థం భారత ఆర్థిక వ్యవస్థ టెక్నికల్‌గా మాంద్యంలోకి వెళ్లిందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర సహా పలువురు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో భారత జీడీపీ 23.9 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ త్రైమాసికంలోను ప్రతికూలత నమోదవుతుందని ఆర్బీఐ బులిటెన్‌లో ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

టెక్నికల్‌గా మాంద్యంలోకి...
దేశ చరిత్రలో తొలిసారి భారత్ ఆర్థిక మాంద్యంలోకి అడుగుపెట్టబోతోందని ఆర్థిక నిపుణులు అన్నారు. వరుసగా రెండో క్వార్టర్‌లో వృద్ధి రేటు క్షీణించడం అంటే మాంద్యంలోకి జారుకున్నట్లేనని తెలిపారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో మొదటి క్వార్టర్లో వృద్ధి భారీగా పతనం కాగా, రెండో త్రైమాసికంలో 8.6 శాతం క్షీణత ఉంటుందని భావిస్తున్నారు. ఆర్బీఐ-నౌకాస్ట్ విధానంలో తొలిసారి విడుదల చేసిన అంచనాల్లో నిపుణులు తమ అభిప్రాయాలు తెలిపారు. టెక్నికల్‌గా భారత్ మాంద్యంలోకి వెళ్లిందని మానిటరీ పాలసీ డిపార్టుమెంటుకు చెందిన పంకజ్ కుమార్ పేర్కొన్నారు.

దశలవారీగా తిరిగి సాధారణస్థితికి
దశలవారీగా ఆర్థిక కార్యకలాపాలును తిరిగి సాధారణ స్థితికి తీసుకు వస్తే ఆర్థిక నష్టాన్ని తగ్గించవచ్చునని పంకజ్ కుమార్ అన్నారు. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడంతో మే, జూన్ నెలలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుందని పేర్కొన్నారు. జూలై-సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాల కోసం ఆర్థికవేత్తలు, పరిశోధకులు నౌకాస్టింగ్ అనే విధానాన్ని ఉపయోగించారు. ఈ విధానంలో వేర్వేరు సమచారాలను విశ్లేషించి అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీటిని కచ్చితంగా ఆర్బీఐ అభిప్రాయాలుగా భావించవద్దు.

నవంబర్ చివరి వారంలో గణాంకాలు..
2020-21 ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికానికి గాను ఆర్బీఐ గణాంకాలు, అంచనాలను విడుదల చేయలేదు. నవంబర్ చివరి వారంలో అధికారిక జీడీపీ గణాంకాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంలో ఆర్థిక వ్యవస్థ 9.5 శాతానికి క్షీణించవచ్చునని గతంలో ఆర్బీఐ అంచనా వేసింది.
More From GoodReturns

GR RBI MPC Poll: ఏప్రిల్‌లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..



Click it and Unblock the Notifications