For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold & Silver Prices: పడిపోతున్న పసిడి ధరలు.. 6 నెలల కనిష్ఠానికి.. అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..

|

Gold Prices: బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా.. ఎప్పుడు కొందామా అని ఎదురుచూస్తున్న వారు మనలో చాలామందే ఉంటారు. పైగా ఏ చిన్న శుభకార్యం ఉన్నా.. గ్రామంత బంగారం అయినా కొనటం మన ఆచారంలో పూర్వకాలం నుంచి వస్తున్నదే. అయితే ఈ క్రమంలో బంగారం రేట్లు తగ్గడం పసిడి ప్రియులకు శుభవార్త గానే చెప్పుకోవాలి. ఎందుకంటే రానున్న పండుగల సీజన్ కోసం ఇప్పుడే తక్కువ ధరలో ఆభరణాలను కొనుక్కునేందుకు వీలు ఉంటుంది. కానీ.. దీనికి మరో పక్క చాలా పెద్ద షాకింగ్ న్యూస్ కూడా ఉంది.

రికార్డు కనిష్ఠాల వద్దా బంగారం ధరలు..

రికార్డు కనిష్ఠాల వద్దా బంగారం ధరలు..

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఈ వారం ప్రారంభంలో US డాలర్‌లో ర్యాలీ మధ్య ఆరు నెలల కంటే ఎక్కువ కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. తరువాత కొంత ఉపశమనం పొందాయి. ఈరోజు బంగారం ధరలు ఔన్సుకు 1,739.71 అమెరికన్ డాలర్లుగా ఉంది. వారం ప్రారంభంలో మంగళవారం బంగారం ధర ఔన్స్‌కి 1,767.53గా ఉంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో డిసెంబర్ తర్వాత ప్రస్తుత ధర కనిష్ఠంగా ఉంది. మన దేశంలో ఇటీవల ఇంపోర్ట్ డ్యూటీని పెంచింది. 2008 నాటి ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదాలు ఉన్నాయని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు అత్యధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం అంచనాలకు ఊతం ఇస్తోంది.

రేట్ల పతనానికి కారణాలు..

రేట్ల పతనానికి కారణాలు..

గ్లోబల్ గోల్డ్ ధరలు ఎక్కువ నష్టపోతున్నాయి. డాలర్‌లో అధిక లాభాలు, పెరుగుతున్న వడ్డీ రేట్ల కారణంగా బంగారంపై స్వల్పకాలం లేదా దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా తగ్గింది. గోల్డ్ ఇన్వెస్టర్ల నుంచి మద్ధతు తగ్గటం వల్ల ధరల పతనం కొనసాగుతోందని నిపుణులు అంటున్నారు. అధిక వడ్డీ రేట్లు, బాండ్ ఈల్డ్‌లు బులియన్ హోల్డింగ్ కు అవరోధాలుగా మారాయి. మరో పక్క వెండి ధరలు తగ్గటం కనిపిస్తోంది.

ఆర్థిక లోటు తగ్గించేందుకు..

ఆర్థిక లోటు తగ్గించేందుకు..

భారత ప్రభుత్వం గత శుక్రవారం బంగారంపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 7.5% నుంచి 12.5%కి పెంచింది. భారతదేశం తన బంగారం అవసరాన్ని చాలా వరకు దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. ఆర్థిక లోటు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. బంగారంపై ప్రస్తుతం 3 శాతం జీఎస్టీ కూడా దేశంలో ఉంది.

మాంద్యం భయాలు..

మాంద్యం భయాలు..

"అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు దాదాపు ఏడు నెలల కనిష్టానికి చేరగా, వెండి 2 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ ఇండెక్స్ 20-సంవత్సరాల గరిష్ఠ స్థాయిని తాకి, గ్లోబల్ రిసెషన్ భయాల కారణంగా 106 పాయింట్లను దాటిన తర్వాత బంగారం, వెండి మంగళవారం క్రాష్ అయ్యాయి. బంగారం మద్దతు $1755-1742 వద్ద ఉండగా.. నిరోధం $1782-1794 వద్ద ఉంది. వెండికి $19.30-19.05 వద్ద మద్దతు ఉండగా.. నిరోధం $19.95-20.20 వద్ద ఉంది" అని మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ ప్రతినిధి రాహుల్ కలంత్రి అన్నారు.

English summary

Gold & Silver Prices: పడిపోతున్న పసిడి ధరలు.. 6 నెలల కనిష్ఠానికి.. అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు.. | in view of financial crisis across world gold and silver prices falling to lows

gold and silver prices falling to lows amid financial meltdown fears
Story first published: Friday, July 8, 2022, 9:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X