For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IMF On RBI: శభాష్ భారత్ అంటూ ప్రశంశించిన IMF.. రిజర్వు బ్యాంక్ పనితీరుపై కితాబు.. అంచనాలు తగ్గిస్తూ..

|

IMF On RBI: భారతీయ రిజర్వు బ్యాంక్ వరుసగా నాలుగు సార్లు కీలక వడ్డీ రేట్లను పెంచటం ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచింది. ఇదంతా చేసింది విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్నితగ్గించటానికే. అయితే రానున్న కాలంలో ఇది ఇంకా పెరుగుతుందని.. రెపో రేటు వచ్చే ఏడాది మెుదటి సమయానికి రెండంకెల స్థాయికి ఇది చేరుకుంటుందని ఆర్థిక వేత్తల అంచనాలు చెబుతున్నాయి.

భవిష్యత్తు కోసమే.. ప్రశంశలు..

భవిష్యత్తు కోసమే.. ప్రశంశలు..

ద్రవ్యోల్బణం అలా పెరుగుతూ పోతే వస్తువుల ధరలు పెరిగి డబ్బు కొనుగోలు శక్తి క్షీణించే ప్రమాదం ఉన్నందున రేట్ల పెంపు విషయంలో రిజర్వు బ్యాంక్ చాలా కఠినంగా ముందుకెళుతోంది. అయితే ఈ విషయంలో RBI కఠిన పనితీరును అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) మంగళవారం ప్రశంసించింది. మెుత్తం మీద నాలుగు విడతలు రిజర్వు బ్యాంక్ 190 బేసిస్ పాయింట్ల మేర రేట్లను పెంచటం వల్ల హోమ్ లోన్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఖరీదానవిగా మారాయి.

లక్ష్యమే ధ్యేయంగా..

లక్ష్యమే ధ్యేయంగా..

భారత్ లో ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్ నిర్ధేశించుకున్న ద్రవ్యోల్బణం లక్ష్యాలకు మించి ఉన్నందున దానిపై పోరాడేందుకు RBI తీసుకుంటున్న చర్యలు భేష్ అంటూ IMF వెల్లడించింది. రానున్న కాలంలో ప్రజలకు ఇది మేలు చేస్తుందని IMF డిప్యూటీ డివిజన్ చీఫ్ గార్సియా పాస్కల్ అన్నారు. ఇతర వర్ధమాన మార్కెట్ల మాదిరిగానే భారతదేశంలో కూడా ద్రవ్య విధానం కఠినతరం చేయబడిందని IMF ఫైనాన్షియల్ కౌన్సెలర్ అండ్ డైరెక్టర్ టోబియాస్ అడ్రియన్ అన్నారు

సమస్యలు కొనసాగుతాయి..

సమస్యలు కొనసాగుతాయి..

ఆర్థిక స్థిరత్వం విషయంలో సమస్యలు దీర్ఘకాలంగా ఉన్నాయని పాస్కల్ అన్నారు. అవి బ్యాంక్, నాన్‌బ్యాంక్ రెండింటికి సంబంధించినవని అభిప్రాయపడ్డారు. కంపెనీల బ్యాలెన్స్ షీట్ల విషయంలోనూ ఇవి కొనసాగకుండా చూసుకోవాలని అభిప్రాయపడ్డారు.

 వృద్ధి రేటు తగ్గింపు..

వృద్ధి రేటు తగ్గింపు..

ఇదే సమయంలో భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను IMF తగ్గిస్తున్నట్లు నిన్న ప్రకటించింది. ద్రవ్యోల్బణం వల్ల ఏర్పడిన మందగమనం కారణంగా భారత వృద్ధి రేటును 6.8 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. గతంలో ఈ అంచనా 7.4% గా ఉంది. అయితే వచ్చే ఏడాదిలో భారతదేశ వృద్ధి రేటు 6.1%గా ఉంటుందని IMF అంచనా వేసింది.

ఇతర దేశాల వృద్ధి అంచనాలు ఇలా..

ఇతర దేశాల వృద్ధి అంచనాలు ఇలా..

భారత్ - 6.8%

స్పెయిన్ - 4.3%

యూకే - 3.6%

కెనడా - 3.3%

ఇటలీ - 3.2%

చైనా - 3.2%

యూరోపియన్ ప్రాంతం -3.1%

బ్రెజిల్ - 2.5%

ఫ్రాన్స్ - 2.5%

మెక్సికో - 2.1%

జపాన్ - 1.7%

యూఎస్ఏ - 1.6%

జర్మనీ - 1.5%

Read more about: imf rbi interest rates inflation
English summary

IMF On RBI: శభాష్ భారత్ అంటూ ప్రశంశించిన IMF.. రిజర్వు బ్యాంక్ పనితీరుపై కితాబు.. అంచనాలు తగ్గిస్తూ.. | imf praised rbi over titening monetary policy to curb high inflation gdp estimates cut

imf praised rbi over titening monetary policy to curb high inflation gdp estimates cut
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X