For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుమ్ము రేపుతున్న ఐకియా.. 7 నెలల్లో రూ 400 కోట్ల బిజినెస్

|

స్వీడన్ కు చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నిచర్ కంపెనీ ఐకియా... హైదరాబాద్ లో దుమ్ము రేపుతోంది. సగటున రోజుకు రూ 2 కోట్ల బిజినెస్ చేస్తోంది. కంపెనీకి ఉన్న లార్జ్ ఫార్మాట్ స్టోర్లలో అత్యంత అధిక సగటు వ్యాపారానికి నమోదు చేస్తోంది మన భాగ్యనగరంలోనే కావటం విశేషం. భారత్ లో ఐకియా తన తోలి స్టోర్ ను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేసింది. గతేడాది ఆగష్టు లో స్టోర్ ను ఇక్కడ ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ ఏడాది మర్చి నాటికి ... అంటే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికీ ఈ కంపెనీ రూ 407 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ది ఎకనామిక్ టైమ్స్ ఈ మేరకు ఒక ఆర్టికల్ ప్రచురించింది. గత ముప్పైయేళ్లుగా భారత్ నుంచి ఫర్నిచర్ ఉత్పత్తులను సేకరిస్తూ తన గ్లోబల్ స్టోర్స్ లో విక్రయించే ఐకియా.... తొలిసారి పూర్తి స్థాయి స్టోర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలనీ భావించింది. ఇందుకోసం దేశంలోని అన్ని ప్రముఖ నగరాలను పరిశీలించిన తర్వాత హైదరాబాద్ ను ఎంపిక చేసుకొంది. ముంబై, బెంగళూరు నగరాలతో పోటీ పడి మరీ మన హైదరాబాద్ ఐకియా మొట్ట మొదటి స్టోర్ ను ఇక్కడకు రప్పించగలిగింది. ఐకియా ఊహించినట్టుగానే హైదరాబాద్ స్టోర్ అమ్మకాల్లో రికార్డులు నెలకొల్పి మన సత్తాను చాటిచెప్పింది

రూ 700 కోట్ల పెట్టుబడి...

దేశంలో తోలి స్టోర్ ను హైదరాబాద్ లో నెలకొల్పేందుకు ఐకియా సుమారు రూ 700 కోట్ల ను పెట్టుబడిగా పెట్టింది. సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ ప్రాంతంలో ఐకియా స్టోర్నునెలకొల్పారు. మొత్తంగా భారత దేశంలో 2025 నాటికి 25 స్టోర్లను నెలకొలపాలనేది ఐకియా లక్ష్యం. ఇందుకోసం రూ 10,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే భారత్ ప్రభుత్వ అనుమతి పొందింది ఈ సంస్థ. ఇప్పయితీకే సుమారు రూ 2,500 కోట్ల మేరకు ఐకియా భారత్ లో పెట్టుబడిగా పెట్టింది. మిగితా స్టోర్లను ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మహా నగరాల్లో నెలకొల్పే ఏర్పాట్లలో ఉంది.

Ikea crosses RS 400 crore sales mark in first year

7,500 ఉత్పత్తులు...

ఐకియా స్టోర్ అంటేనే ఫర్నిచర్ ప్రొడక్టులకు కేర్ ఆఫ్ అడ్రెస్. అందులో దొరకని ప్రోడక్ట్ ఉండదు అనేది వినియోగదారుల మాట. అదే సమయంలో అందుబాటుధరల్లో అద్బుతమైన డిజైన్ల ఫర్నిచర్ కొనాలంటే ఐకియా నే సరైన ప్లేస్ అని ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అందుకే మన హైదరాబాద్ లో స్టోర్ ప్రారంభించగానే జనం తండోపతండాలుగా వెళ్లారు. స్టోర్ లో అందుబాటులో ఉంచిన సుమారు 7,500 ఉత్పత్తులను వీక్షించి తమకు కావాల్సిన వాటిని కొనుగోలు చేసారు. ఇతర గ్లోబల్ స్టోర్ లలో 10,000 ప్రోడక్టులు ఉంటాయట. అయితే భారత దేశ పరిస్థితులకు అనుగుణంగా ఉన్నవాటిని మాత్రమే ఇక్కడ అమ్మకానికి ఉంచుతున్నారు. ఐకియా స్టోర్ ప్రారంభం రోజే హైదరాబాద్ స్టోర్ ను దాదాపు 40,000 మంది వినియోగదారులు సందర్శించారట. ఇది కూడా ఒక రికార్డే. ఐకియా స్టోర్ లో ఫుడ్ అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

ఈ-కామర్స్ కంటే బెటర్...

దేశీయ ఫర్నిచర్ రంగం విలువ పరంగా చాలా పెద్దది. ఇందులో నాలుగింట మూడో వంతు అసంఘటిత రంగంలోనే ఉంది. రిటైల్ షాపులు, కార్పెంటర్ల నుంచి నేరుగా కొనుగోళ్లు జరుగుతాయి. కాగా దేశంలో అర్బన్ లాడర్, పెప్పర్ ఫ్రై లాంటి ఈ కామర్స్ ఫర్నిచర్ కంపెనీలు ఉన్నాయి. అమ్మకాల పరంగా చూస్తే అర్బన్ లాడర్ కు సమానంగా, పెప్పర్ ఫ్రై కంటే రెండింతలు అధికంగా ఐకియా స్టోర్ అమ్మకాలు నమోదు అయ్యాయని ది ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఫర్నిచర్ విభాగంలోకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి దిగ్గజాలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. కానీ అనుకున్న మేరకు ముందుకు వెళ్లలేకపోయాయి. కాగా, ఐకియాకు హైదరాబాద్ స్టోర్ ఇచ్చిన ఊపుతో దేశంలో మరిన్ని స్టోర్ లను త్వరగా ప్రారంభించే ఏర్పాట్లలో ఉంది.

English summary

దుమ్ము రేపుతున్న ఐకియా.. 7 నెలల్లో రూ 400 కోట్ల బిజినెస్ | Ikea crosses RS 400 crore sales mark in first year

The world’s biggest furniture retailer Ikea sold goods worth about Rs 2 crore every day on an average in its first year of operations, crossing Rs 400 crore in FY19 total revenue from its maiden store opened last August. This is a revenue record for any brand in the country from just one store -and in its debut year - in a market otherwise considered extremely value conscious.
Story first published: Tuesday, December 3, 2019, 9:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X