For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IIFL NCD's: 9% వడ్డీ అందిస్తున్న ఐఐఎఫ్ఎల్.. పెట్టుబడి అవకాశం గురించి ఇప్పుడు తెలుసుకోండి..

|

IIFL NCD's: మనలో చాలా మందికి NCD అంటే పరిచయం లేకపోవచ్చు. వీటిని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు అని పిలుస్తారు. ఇవి డెట్ పెట్టుబడి మార్గాల్లో ఒకటి. బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే వీటికి వడ్డీ అధికంగా లభిస్తుంది కూడా. అయితే ప్రస్తుతం ఐఐఎఫ్ఎల్ సెక్యూర్డ్ డిబెంచర్లను విడుదల చేస్తోంది. వీటిని కొనుగోలు చేయటం ద్వారా పెట్టుబడిదారులకు లభించే 8 ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

లిక్విడిటీ..

ఎన్సీడీలను స్టాక్ మార్కెట్లలో కూడా లిస్ట్ చేస్తారు. అందువల్ల ఎప్పుడైనా విక్రయించుకునేందుకు అవకాశం లభిస్తుంది. పైగా వీటిపై లభించే ఆదాయానికి ఎలాంటి టీడీఎస్ కోతలు ఉండవు. అయితే బ్యాంక్ డిపాజిట్ల విషయంలో ఏడాదికి వడ్డీ ఆదాయం రూ.10 వేలకు మించితే టీడీఎస్ తగ్గించబడుతుంది.

IIFL issuing NCDs with CRISIL AA rating investors get upto 9 percent interest

ఇన్వెస్టర్లకు 8 ప్రయోజనాలు..

- పెట్టుబడి పెట్టే వినియోగదారులకు దాదాపుగా 9 శాతం వడ్డీ లభిస్తుంది
- మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ రానున్న 2-5 ఏళ్ల కాలంలో ఎన్సీడీ ఇన్వెస్టర్లకు 8.5-9 శాతం వడ్డీ లభిస్తుంది
- వడ్డీ ఆదాయంపై ఎలాంటి టీడీఎస్ ఉండనందున ఫారం-15g, 15h ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు
- సెక్యూర్ చేయబడిని ఐఐఎఫ్ఎల్ ఎన్సీడీలు స్టాక్ మార్కెట్లో జాబితా చేయబడతాయి
- ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అందిస్తున్న 7.5 శాతం వడ్డీ రేటు కంటే 1.5 శాతం అధిక వడ్డీ ఆదాయం లభిస్తుంది
- కంపెనీ ఆస్తులు గ్యారెంటీగా ఉంచినందున ఇన్వెస్టర్ల డబ్బు సేఫ్ గా ఉంటుంది
- ఐఐఎఫ్ఎల్ కంపెనీ డిబెంచర్లు CRISIL సంస్థ AA రేటింగ్ అందించింది దీని వల్ల ఇన్వెస్టర్ల డబ్బుకు సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది
- కంపెనీకి మంచి వ్యాపారం, బలమైన ఆర్థిక ఫలితాలు ఉన్నందున ఇన్వెస్టర్లకు సేఫ్టీ ఎక్కువ

ఇష్యూ వివరాలు..

ఐఐఎఫ్ఎల్ ఎన్సీడీల సబ్ స్క్రిప్షన్ జనవరి 6, 2023న ఓపెన్ అయింది. ఇది ఈనెల 18న క్లోజ్ అవుతోంది. కంపెనీ ఈ ఇష్యూ ద్వారా రూ.100 కోట్లను సమీకరిస్తోంది. పైగా గ్రీన్ షూ ఆప్షన్ ద్వారా రూ.900 కోట్లను కేటాయించింది. దీంతో మెుత్తం ఇష్యూ సైజ్ రూ.1000 కోట్లుగా ఉంది. ఒక్కో ఎన్సీడీ ఫేస్ వ్యాల్యూ రూ.1,000 గా ఉంది. ఎంత కాలం పెట్టుబడి పెడితే ఎంత సొమ్ము వస్తుంది వంటి పూర్తి వివరాలు టేబుల్ లో ఉన్నాయి.

IIFL issuing NCDs with CRISIL AA rating investors get upto 9 percent interest

దేశంలో అగ్రశ్రేణి NBFCగా IIFL ఫైనాన్స్

IIFL ఫైనాన్స్ లిమిటెడ్ ("IIFL" లేదా "కంపెనీ") అనేది RBIలో నమోదు చేయబడిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ("NBFC-ND-SI") క్రమబద్ధంగా ముఖ్యమైన నాన్-డిపాజిట్.ఇది ఉత్పత్తుల శ్రేణి ద్వారా విభిన్న కస్టమర్ బేస్ యొక్క క్రెడిట్ అవసరాలను తీరుస్తుంది.IIFL యొక్క ఆఫర్‌లలో గృహ రుణాలు, బంగారు రుణాలు, ఆస్తిపై రుణాలు,మధ్యస్థ మరియు చిన్న సంస్థ ఫైనాన్సింగ్, మైక్రో ఫైనాన్స్, నిర్మాణం మరియు రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ ,క్యాపిటల్ మార్కెట్ ఫైనాన్స్‌తో సహా వ్యాపార రుణాలు ఉన్నాయి. ఇది రిటైల్ మరియు కార్పొరేట్ కస్టమర్‌లకు అన్ని సేవలను అందిస్తుంది.

బలమైన నెట్‌వర్క్

సెప్టెంబర్ 30, 2022 నాటికి, కంపెనీ దేశవ్యాప్తంగా 3,766 శాఖల విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉంది మరియు సెప్టెంబర్ 30, 2022 నాటికి 32,452 మంది ఉద్యోగులతో బలమైన సంస్థగా నిలిచింది.

బలమైన వృద్ధి

సెప్టెంబర్ 30, 2022 మరియు జూన్ 30, 2022 నాటికి, నిర్వహణలో ఉన్న ఆస్తులు వరుసగా రూ. 55,302 కోట్లు మరియు రూ. 52,761 కోట్లుగా ఉన్నాయి. కంపెనీ కార్యకలాపాలు సాగించిన సంవత్సరాల్లో స్థిరంగా తక్కువ స్థాయి NPAలను నిర్వహిస్తోంది. అంతేకాదు సెప్టెంబర్ 30, 2022 నాటికి కన్సాలిడేటెడ్ లోన్ బుక్స్‌ ప్రకారం GNPA 2.42% మరియు NNPA 1.22%తో నాణ్యతతో కూడిన ఆస్తులను మెయిన్‌టెయిన్ చేయడంపై దృష్టి సారించింది. అదనంగా, సెప్టెంబర్ 30, 2022 నాటికి, కంపెనీ కన్సాలిడేటెడ్ లోన్ బుక్‌లో 85.03% వరకు తగిన కొలేటరల్‌లతో భధ్రపరచబడింది.ఇది ప్రమాదాలను మరింత తగ్గించడంలో సహాయపడుతుంది.

English summary

IIFL NCD's: 9% వడ్డీ అందిస్తున్న ఐఐఎఫ్ఎల్.. పెట్టుబడి అవకాశం గురించి ఇప్పుడు తెలుసుకోండి.. | IIFL issuing NCD's with CRISIL AA rating investors get upto 9 percent interest

IIFL issuing NCD's with CRISIL AA rating investors get upto 9 percent interest..
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X