For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిల్డర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు... ఎన్ని కేసులు వేశారో తెలుసా?

|

ఇళ్లు కొనేదాక ఒక మాట... కొన్న తర్వాత మరో మాట.. చిన్న బిల్డర్, పెద్ద బిల్డర్ అన్న తేడా లేదు. చెప్పిన సమయానికి ఇంటి నిర్మాణం పూర్తి చేయరు. కొనుగోలు దారులు ఎంత మొత్తుకున్నా పట్టించుకోరు. ప్రాజెక్టులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయని కారణంగా అనేక మంది ఇళ్ల కొనుగోలు దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగాను నష్టపోతున్నారు. గృహాల కొనుగోలు దారుల రక్షణ కోసం ప్రభుత్వం కొత్త చట్టాలను తెస్తున్నప్పటికి బిల్డర్ల ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. వారి మొండి వైఖరి కొనుగోలుదారులకు శాపంగా మారుతోంది.

బిల్డర్ లేదా రియాల్టీ కంపెనీని నమ్మి పెట్టుబడులు పెడితే ఆ కంపెనీ వర్గాలు నిధులను ప్రాజెక్టుకు వినియోగించకుండా పక్కదారి పట్టిస్తున్నాయి. కొన్ని కంపెనీలు దివాలాతీస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు వివాదాల్లో చిక్కుకొని ప్రాజెక్టులను పూర్తిచేయడం లేదు. ఇలాంటి సమస్యల వల్ల ఇళ్ల కొనుగోలుదారులు ఎదుర్కొనే బాధలు వర్ణనాతీతం. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువస్తోంది. వీటితో కొను గోలుదారులు మరిన్ని హక్కులు కల్పించారు. దీంతో వారు కూడా బిల్డర్ కంపెనీ రుణ దాతలుగా మారిపోయారు. కాబట్టి వీరూ బిల్డర్ పై దివాళా పిటిషన్ ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సీ ఎల్ టీ) ఫైల్ చేసే అధికారం కల్పించారు.

మోడీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం: రోజుకు 9 గంటలు వర్కింగ్ హవర్స్మోడీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం: రోజుకు 9 గంటలు వర్కింగ్ హవర్స్

రంగంలోకి కొనుగోలుదారులు

రంగంలోకి కొనుగోలుదారులు

ఇళ్ల కొనుగోలు దారులు దివాళా పిటీషన్ ను ఫైల్ చేసే హక్కు కల్పించడంతో రంగంలోకి దిగిపోయారు. ఇప్పటిదాకా దివాళా, బ్యాంక్ రప్ట్సై (ఐబీసీ) కింద కొనుగోలు దారులు 1821 కేసులుదాఖలు చేశారు. 2018 జూన్ నుంచి ఈ కేసులు దాఖలయ్యాయి. ఈ విషయాన్ని లోకసభలో ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు అనేక కేసులు పెండింగులో ఉన్నట్టు తెలిపింది. బిల్డర్లు చిన్న డిఫాల్ట్ అయినా కూడా కేసు వేస్తున్నారు కొనుగోలు దారులు. కేసుల పరిష్కారంలో జాప్యం అవుతోంది. ఈ నేపథ్యంలో పరిణామాలను పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.

డెవలపర్లలో దడ..

డెవలపర్లలో దడ..

పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను, రియల్ ఎస్టేట్ రెగ్యు లేటరీ అథారిటీ వంటి వాటిని తీసుకువచ్చి ప్రభుత్వం రియాల్టీ రంగాన్ని సంస్కరించింది. వీటి మూలంగా చిన్న చిన్న రియల్టర్లు పత్తా లేకుండా పోయారు. ఇక బడా రియల్టర్లు తమ బద్దకం వీడుతున్నారు. అనుకున్న సమయంలో తమ ప్రాజెక్ట్ లను పూర్తి చేయక తప్పని పరిస్థితి. ఇప్పుడు దివాళా పిటీషన్ ఫైల్ చేసే అవకాశం ఉండటంతో మరింత బాధ్యతగా ప్రవర్తించాల్సి వస్తోంది.

1,400 కోట్ల డాలర్లు....

1,400 కోట్ల డాలర్లు....

దేశీయ రియల్ ఎస్టేట్ రంగం భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2015 నుంచి ఈ ఏడాది మూడో త్రైమాసికం వరకు దేశీయ రియల్ ఎస్టేట్ రంగం 1,400 కోట్ల డాలర్ల విదేశీ ప్రయవాటే ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇందులో దాదాపు 63 శాతం (880 కోట్ల డాలర్లు) కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాయని రియల్ ఎస్టేట్ సర్వీసుల కంపెనీ అనరాక్ వెల్లడించింది. ఇదేకాలంలో రెసిడెన్షియల్ రంగం 150 కోట్ల డాలర్లు ఆకర్షించింది.

English summary

బిల్డర్లకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు... ఎన్ని కేసులు వేశారో తెలుసా? | Homebuyers filed over 1,800 cases under insolvency law

Homebuyers have filed more than 1,800 cases against builders under the Insolvency and Bankruptcy Code (IBC) since June 2018, the government told the Lok Sabha.
Story first published: Tuesday, November 19, 2019, 12:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X