For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియాల్టీ కోలుకుంటోంది, ఇండిపెండెంట్ ఇళ్లకు భలే డిమాండ్: హైదరాబాద్ 'కొత్త' జోరు

|

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం రియాల్టీ రంగంపై భారీగానే పడింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇళ్ల విక్రయాలు జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే 23 శాతం తగ్గాయి. కానీ గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే 83 శాతం పెరిగింది. ఈ మేరకు రియాల్టీ సంస్థ JLL ఇండియా పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య 19,635 ఇళ్లు అమ్ముడు పోగా, జనవరి -మార్చి కాలంలో 25,583 ఇళ్లు సేల్ అయ్యాయి. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా గత ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో 10,753 యూనిట్లు మాత్రమే అమ్ముడు పోయాయి.

ఏ నగరంలో ఎంత సేల్స్ అంటే

ఏ నగరంలో ఎంత సేల్స్ అంటే

త్రైమాసికం పరంగా ఇళ్ల డిమాండ్ తగ్గినప్పటికీ, ఏడాది ప్రాతిపదికన పెరిగింది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్సీఆర్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పుణే నగరాల్లో త్రైమాసిక ప్రాతిపదికన ఏప్రిల్-జూన్ కాలంలో హోమ్ సేల్స్ 23 శాతం తగ్గాయి. ఈ త్రైమాసికంలో కేవలం బెంగళూరులో మాత్రమే సేల్స్ పెరిగాయి. మిగతా ఆరు నగరాల్లో తగ్గాయి.

బెంగళూరులో 47 శాతం పెరిగి 3500కు పెరిగాయి. చెన్నైలో 81 శాతం తగ్గి 600, ఢిల్లీ-ఎన్సీఆర్‌లో 55 శాతం క్షీణించి 2440, హైదరాబాద్‌లో 15 శాతం తగ్గి 3157, కోల్‌కతాలో 56 శాతం తగ్గి 578, ముంబైలో దాదాపు స్థిరంగా ఉండి 5821, పుణేలో 6 శాతం తగ్గి 3539 యూనిట్లు సేల్ అయ్యాయి.

హైదరాబాద్‌లో పెరిగిన కొత్త ఇళ్లు

హైదరాబాద్‌లో పెరిగిన కొత్త ఇళ్లు

త్రైమాసికం పరంగా రెసిడెన్షియల్ సేల్స్ 61 శాతం తగ్గాయి. 2021 మొదటి అర్ధ సంవత్సరంలో హోమ్ సేల్స్ 17 శాతం పెరిగాయి. 2021 రెండో త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 83 శాతం పెరిగాయి. 2021 మొదటి అర్ధ సంవత్సరంలో హౌసింగ్ సేల్స్ ఏడాది ప్రాతిపదికన 18 శాతం ఎగిసి 45,000గా ఉన్నాయి.

టాప్ 7 నగరాల్లో కొత్త లాంచింగ్స్ 20 శాతం పడిపోయి 27,057కు పరిమితమయ్యాయి. టాప్ 7 నగరాల్లో హైదరాబాద్, ముంబైలలో కొత్త లాంచింగ్స్ పెరిగాయి. బెంగళూరులో 12 శాతం, చెన్నైలో 92 శాతం, ఢిల్లీ ఎన్సీఆర్‌లో 78 శాతం, కోల్‌కతాలో 65 శాతం, పుణేలో 30 శాతం క్షీణించాయి. అదే సమయంలో హైదరాబాద్‌లో 28 శాతం, ముంబైలో 33 శాతం పెరిగాయి.

ధరలు ఎలా ఉన్నాయంటే

ధరలు ఎలా ఉన్నాయంటే

2021 క్యాలెండర్ ఏడాది రెండో త్రైమాసికంలో ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. డిమాండ్ లేమి కారణంగా డెవలపర్లు ఆకర్షణీయ డిస్కౌంట్లు, ఉచిత ఆకర్షణ పథకాలు, పేమెంట్స్ స్కీంలు అందిస్తున్నారు. ప్రధానంగా ఇండిపెండెంట్ ఇళ్లకు డిమాండ్ పెరిగింది. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత నుండి ఇండిపెండెండ్ హౌస్, విల్లాల అమ్మకాలు పది శాతం నుండి ఇరవై శాతం పెరిగాయి.

హైదరాబాద్ సూపర్

హైదరాబాద్ సూపర్

తెలంగాణలో రియాల్టీ రంగం క్రమంగా పట్టాలెక్కుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు త్రైమాసికం 15 శాతం క్షీణించాయి. అదే సమయంలో ఏఢాది ప్రాతిపదికన 62 శాతం పెరిగాయి. నిర్మాణాలు కూడా భారీగా పెరిగాయి. ఈ ఏఢాది తొలి త్రైమాసికంలో 8591 కొత్త యూనిట్లు ప్రారంభం కాగా, రెండో త్రైమాసికంలో 10,980కి చేరుకుంది.

English summary

రియాల్టీ కోలుకుంటోంది, ఇండిపెండెంట్ ఇళ్లకు భలే డిమాండ్: హైదరాబాద్ 'కొత్త' జోరు | Home sales rise by 23 percent But unsold inventory dips to a 24 month low

In an indication that the worst may be over for the retail real-estate sector, the level of unsold housing inventory has hit a 24 month low.
Story first published: Tuesday, July 6, 2021, 13:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X