For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Defence Stock: ఒక కారణంతో దూసుకెళ్తున్న స్టాక్.. బ్రోకరేజ్ టార్గెట్ దిశగా..

|

Defence Stock: దేశంలో డిఫెన్స్ రంగంలో చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి. అయితే మోదీ సర్కార్ వచ్చిన తర్వాత విదేశాల నుంచి రక్షణ పరికరాల దిగుమతి కంటే వీలైనంత వరకు వాటిని దేశంలోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. దీంతో ఆ రంగంలోని స్టాక్స్ రాకెట్ వేగంతో ముందుకు సాగుతూ ఇన్వెస్టర్లను ధనవంతులుగా మారుస్తున్నాయి.

 కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ స్టాక్. ప్రస్తుతం అంతర్జాతీయంగా, దేశీయంగా ఆర్థిక అస్థిర వాతావరణం కొనసాగుతున్నప్పటికీ.. ఈ వారం మూడో ట్రేడింగ్ రోజున స్టాక్ తన 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అసలు ఈ దూకుడుకు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 స్టాక్ ధర వివరాలు..

స్టాక్ ధర వివరాలు..

మార్కెట్ ట్రేడింగ్ సమయంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ షేరు ధర రూ.2,745కి చేరుకుంది. ఇది గతంలో ఎన్నడూ లేనంత గరిష్ స్థాయి.గత ట్రేడింగ్ రోజున కూడా ఈ స్టాక్ కొనుగోలు పెరిగి 52 వారాల గరిష్ఠ స్థాయి. దీంతో కంపెనీ మార్కెట్ రూ.90 వేల కోట్ల మార్కును తాకింది. దీనికి కంపెనీకి వచ్చిన ఒక ఆర్డర్ కారణంగా నిలిచింది.

స్టాక్ పెరుగుదలకు కారణం..

స్టాక్ పెరుగుదలకు కారణం..

ఇటీవల హిందూస్థాన్ ఏరోనాటిక్స్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ల(ALH) MK-III తయారీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి కాంట్రాక్ట్ పొందింది. ఈ వార్త బయటకు రావటంతో స్టాక్ రాకెట్ లాగా పెరుగుతోంది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ అనేది పారిశ్రామిక రంగంలో పనిచేసే నవరత్న కంపెనీ. గతంలో బ్రోకరేజ్ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ స్టాక్ 14% పెరగవచ్చని తెలిపింది. బ్రోకరేజ్ 3 నెలల్లో స్టాక్‌పై టార్గెట్ ధర రూ.2,990గా నిర్ణయించింది.

English summary

Defence Stock: ఒక కారణంతో దూసుకెళ్తున్న స్టాక్.. బ్రోకరేజ్ టార్గెట్ దిశగా.. | hindustan aeronautics hit 52 weeks high with helicopters order

hindustan aeronautics hit 52 weeks high with helicopters order
Story first published: Wednesday, November 23, 2022, 16:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X