For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్త్ ఇన్సురెన్స్ షాక్, ప్రీమియం ధరలు పెరగొచ్చు!

|

ఆరోగ్య బీమా సంస్థు బీమా ప్రీమియం ధరలను పెంచే అవకాశముంది. కరోనా మహమ్మారిపై మొత్తం పరిస్థితి ఎంత త్వరగా నియంత్రణలోకి వస్తుందనే అంశంపై ఆరోగ్య బీమా ధరలు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. కరోనా సంబంధిత సమస్యలు బాగా పెరగడంతో పాటు ఈ అంటువ్యాధులను అదుపు చేయకపోతే ఆరోగ్య బీమా సంస్థలు వార్షిక ప్రీమియంలను ఇరవై శాతం వరకు పెంచవచ్చునని అంచనా.

బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!

ఇరవై శాతం ప్రభావం

ఇరవై శాతం ప్రభావం

ఆరోగ్య బీమా అంచనాల ప్రకారం కరోనా క్లెయిమ్స్ కారణంగా ఆరోగ్య బీమా సంస్థల నికర ఆదాయాలపై కనీసం ఇరవై శాతం ప్రభావం ఉంటుంది. కొత్త పాలసీల కోసం ప్రీమియం ధరలు పెంచడానికి బీమా సంస్థల ఆలోచిస్తాయని సీనియర్ ఇన్సురెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. 2020 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్య బీమా సంస్థల ఆదాయం దాదాపు రూ.40వేల కోట్లు. ఇది కోనా లింక్డ్ ఉత్పత్తుల అధిక అమ్మకాలు, ఇతర సమగ్ర ఆరోగ్య కవర్ పాలసీలకు దారి తీసింది.

క్లెయిమ్స్ రెట్టింపు

క్లెయిమ్స్ రెట్టింపు

కరోనా కేసులు, క్లెయిమ్స్ సంఖ్య పెరిగితే బీమా సంస్థలు IRDAIను సంప్రదించి ధరలపై పునరాలోచనలో పడటానికి అవకాశముంది. గత ఏడాది మార్చి తర్వాత క్లెయిమ్స్ రేటు వేగంగా పెరుగుతోంది. భారత్‌లో కరోనా కేసుల పెరుగుదలకు, క్లెయిమ్స్ రేటుకు సంబంధం ఉంది. క్లెయిమ్స్ సంఖ్య గత ఏడాది సెప్టెంబర్ నెలలో అత్యధికంగా ఉంది. ఇప్పుడు క్లెయిమ్స్ గత సెప్టెంబర్ కంటే రెట్టింపు, అంతకంటే ఎక్కువ ఉన్నాయి.

ట్రీట్మెంట్ కోసం..

ట్రీట్మెంట్ కోసం..

గత ఆర్థిక సంవత్సరంలో కరోనా ట్రీట్మెంట్ కోసం ఆరోగ్య బీమా సంస్థలకు దాదాపు రూ.17వేల కోట్ల క్లెయిమ్స్ వచ్చాయి. అయితే కరోనా భయం చాలామందిని కోవిడ్ పాలసీలు కొనుగోలు చేసేందుకు ప్రేరేపించింది. దీంతో ఆరోగ్య బీమా పరిశ్రమపై భారీ ప్రభావం పడింది. కోవిడ్ 19 క్లెయిమ్స్ పరంగా ఆరోగ్య బీమా పరిశ్రమ క్లెయిమ్స్‌లో మొత్తం 5వ వంతు క్లెయిమ్స్ కలిగి ఉంటాయి.

English summary

హెల్త్ ఇన్సురెన్స్ షాక్, ప్రీమియం ధరలు పెరగొచ్చు! | Health insurers may raise premium rates

With a steep rise in covid-19-related claims, health insurers could increase annual premiums by as much as 20% if the rise in the number of infections isn’t arrested, three industry executives said.
Story first published: Monday, April 19, 2021, 14:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X