For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నష్టాలతో ముగిసిన అక్టోబర్! చివరలో వెల్లువెత్తిన అమ్మకాలు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం(అక్టోబర్ 29) నష్టాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు ఢీలాపడ్డాయి. సూచీలు ఆద్యంతం ఒడిదుడుకులకు లోనయ్యాయి. నిఫ్టీ అక్టోబర్ సిరీస్ 11,700 దిగువన ముగిసింది. సెన్సెక్స్ 172.61 పాయింట్లు (0.43%) నష్టపోయి 39,749.85 వద్ద, నిఫ్టీ 58.80 పాయింట్లు (0.50%) దిగజారి 11,670.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

1019 షేర్లు లాభాల్లో, 1542 షేర్లు నష్టాల్లో ముగియగా, 170 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఐటీ, ఎనర్జీ స్టాక్స్ మినహా అన్ని రంగాలు కూడా నష్టాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మెటల్, ఆటో భారీ నష్టాలను నమోదు చేశాయి. బిఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.5 శాతం మేర నష్టపోయింది. రూపాయి 23 పైసలు క్షీణించి 74.10 వద్ద ముగిసింది.

Loan Moratorium: దరఖాస్తు అవసరంలేదు, వారికీ ప్రయోజనం.. వడ్డీ మాఫీపై మరో ఊరట!Loan Moratorium: దరఖాస్తు అవసరంలేదు, వారికీ ప్రయోజనం.. వడ్డీ మాఫీపై మరో ఊరట!

నిఫ్టీ 3 వారాల కనిష్టానికి

నిఫ్టీ 3 వారాల కనిష్టానికి

HDFC బ్యాంకు, HDFC, ఫైనాన్షియల్స్, ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్, టైటాన్ తదితర స్టాక్స్ సెన్సెక్స్ భారీ నష్టాలకు కారణమయ్యాయి.

సెన్సెక్స్ 30లో 21 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

రంగాలవారీగా బీఎస్ఈ క్యాపిటల్ గూడ్స్ 2.14 శాతం మేర నష్టపయింది.

మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 3 వారాల కనిష్టానికి చేరుకుంది.

నిఫ్టీ బ్యాంకు 141 పాయింట్లు నష్టపోయి 24,092 పాయింట్ల వద్ద ముగిసింది.

మిడ్ క్యాప్ సూచీ 74 పాయింట్లు నష్టపోయి 16,974 వద్ద ముగిసింది.

క్యూ2 ఫలితాల అనంతరం ఎల్ అండ్ టీ నష్టాల్లోకి వెళ్లింది.

టైటాన్ రెండో రోజు నష్టాలను నమోదు చేసింది.

యాక్సిస్ బ్యాంకు రెండు శాతం మేర నష్టపోయింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతం లాభాల్లో ముగిసింది. రేపు క్వార్టర్ ఫలితాలను ప్రకటించనుంది.

జూట్ కంపెనీ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.

పలుదేశాల్లో కరోనా కేసులు పెరగడం, లాక్ డౌన్ అమలు చేస్తారనే ఆందోళనలు అంతర్జాతీయ మార్కెట్‌ను భయపెట్టాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపించినప్పటికీ చివరలో అమ్మకాలు వెల్లువెత్తాయి.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, అల్ట్రా టెక్ సిమెంట్, శ్రీ సిమెంట్స్, కొటక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో లార్సన్ టైటాన్ కంపెనీ, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ ఉన్నాయి.

నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో రిలయన్స్, యాక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్స్ 3 శాతం మేర లాభపడ్డాయి. సెప్టెంబర్ క్వార్టర్‌లో మంచి లాభాలు నమోదు చేయడంతో స్టాక్స్ ఎగిశాయి.

మారుతీ సుజుకీ నెట్ ప్రాఫిట్ దాదాపు స్థిరంగా ఉంది. అంచనాలను అందుకోలేకపోయింది. నేడు ఈ స్టాక్ 1.42 శాతం క్షీణించి రూ.7,084 వద్ద క్లోజ్ అయింది.

ఐటీ స్టాక్స్ జూమ్

ఐటీ స్టాక్స్ జూమ్

నిఫ్టీ ఐటీ, ఎనర్జీ మినహా అన్ని స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. టీసీఎస్ షేర్ 0.38 శాతం లాభపడి రూ.2,632 వద్ద ముగిసింది. హెచ్‌సీఎల్ టెక్ షేర్ 0.82 శాతం ఎగిసి రూ.836.40 వద్ద, టెక్ మహీంద్ర స్టాక్ 0.30 శాతం లాభపడి రూ.806.70 వద్ద, విప్రో స్టాక్ 1.12 శాతం లాభపడి రూ.339.40 వద్ద,

ఇన్ఫోసిస్ స్టాక్ 0.33 శాతం నష్టపోయి రూ.1,073 వద్ద, మైండ్ ట్రీ స్టాక్ 0.55 శాతం నష్టపోయి రూ.1,320 వద్ద, కోఫోర్జ్ స్టాక్ 1.40 శాతం కోల్పోయి రూ.2,211 వద్ద ముగిసింది.

English summary

నష్టాలతో ముగిసిన అక్టోబర్! చివరలో వెల్లువెత్తిన అమ్మకాలు | HDFC twins, LT drag Sensex 173 points lower: Nifty ends Oct series below 11,700

Except IT and energy, all other sectoral indices ended lower led by FMCG, pharma, metal and auto. BSE Samllcap index shed 0.5 percent.
Story first published: Thursday, October 29, 2020, 17:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X