హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్(HDFC) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం 27.6 శాతం(పన్ను తర్వాత) క్షీణించి రూ.2,870.1 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3,961.5 కోట్లుగా నమోదయింది. జూన్ త్రైమాసికంలో బ్యాంకు ఏకీకృత సగటు లాభం 15 శాతం పెరిగి రూ.4,059 కోట్లు నమోదు చేసింది. ఇటీవల పలు కంపెనీలు సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను ప్రకటించాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగ ఫలితాలు నెగిటివ్‌గా ఉన్నాయి.

పెరిగిన నికర వడ్డీ ఆదాయం
సెప్టెంబర్ త్రైమాసికానికి గాను ఆపరేషన్స్ ఆదాయం రూ.11,727.96 కోట్లుగా నమోదయింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.13,484.44 కోట్లుగా ఉంది.
నికర వడ్డీ ఆదాయం(NII) రెండో త్రైమాసికంలో రూ.3,647 కోట్లుగా నమోదయింది. గత ఏడాది రూ.3,021 కోట్లుగా ఉంది. నెట్ ఇంటరెస్ట్ ఆదాయం 21 శాతం పెరగడం గమనార్హం.
సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన అర్ధసంవత్సరానికి గాను రుణవ్యాప్తి 2.27 శాతం పెరిగింది. ఇండివిడ్యువల్ లోన్ బుక్ 1.91 శాతం, నాన్-ఇండివిడ్యువల్ బుక్ 3.15 శాతం పెరిగింది.
సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతంగా, ఆరు నెలల కాలానికి 3.2 శాతంగా ఉంది.

రికవరీ...
సమీక్ష త్రైమాసికంలో మూలధనం హెచ్‌డీఎఫ్‌సీ వద్ద 20.7 శాతంగా ఉంది. ఈ ఏడాది త్రైమాసికంలో పెట్టుబడుల అమ్మకాలపై రూ.61 లక్షల నష్టం వాటిల్లింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.1627 కోట్లుగా నమోదయింది. హోమ్ ఫైనాన్స్ మొత్తం అడ్వాన్స్‌లు 10 శాతం పెరిగి రూ.5.4 లక్షల కోట్లు నమోదయింది. కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా తమ రిటైల్ లెండింగ్ వ్యాపారంపై ప్రభావం పడిందని క్రితం త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో బ్యాంకు పేర్కొంది. అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో క్రమంగా రికవరీ కనిపించింది.

తగ్గిన బ్యాడ్ లోన్లు
గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ 30, 2020తో ముగిసిన త్రైమాసికానికిగాను వ్యక్తిగత లోన్ దరఖాస్తులు 12 శాతం, అప్రూవల్స్ 9 శాతం పెరిగాయని బ్యాంకు తెలిపింది. వ్యక్తిగత పంపిణీ గత ఏడాదితో పోలిస్తే 95 శాతంగా నమోదయింది. HDFC బ్యాడ్ లోన్లు 6 బేసిస్ పాయింట్లు క్షీణించింది. బ్యాంకు షేర్లు ఈ కాలంలో 7 శాతం మేర లాభపడ్డాయి. నేడు బ్యాంకు స్టాక్ 5.13 శాతం లాభపడింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..



Click it and Unblock the Notifications