For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకింగ్‌లో ఫస్ట్, మొత్తంగా థర్డ్... HDFC బ్యాంకు సరికొత్త రికార్డ్

|

ముంబై: ప్రయివేటురంగ బ్యాంకు దిగ్గజం HDFC బ్యాంకు లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బుధవారం (నవంబర్ 25) రూ.8 లక్షల కోట్లు దాటింది. ఈ మార్కు దాటిన భారత మూడో కంపెనీగా నిలవడంతో పాటు బ్యాంకింగ్ సంస్థల్లో ఇదే మొదటిది. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.13 లక్షల కోట్లు, టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లుగా ఉంది. ఆ తర్వాత రూ.8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ దాటిన కంపెనీగా రికార్డులకెక్కింది.

అమెరికా చరిత్రలో అతిపెద్ద రీకాల్, 60 లక్షల వాహనాలు వెనక్కిఅమెరికా చరిత్రలో అతిపెద్ద రీకాల్, 60 లక్షల వాహనాలు వెనక్కి

స్టాక్స్ రికార్డు గరిష్టానికి

స్టాక్స్ రికార్డు గరిష్టానికి

ప్రయివేటు రంగ దిగ్గజం HDFC బ్యాంకు స్టాక్ ధర నేడు రూ.1464 వద్ద గరిష్టాన్ని తాకింది. ఉదయం మంచి లాభాల్లో ఉన్న స్టాక్, మధ్యాహ్నం సమయానికి నష్టాల్లోకి వెళ్లింది. మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రారంభమై, నష్టాల్లోకి వెళ్లాయి. ఫైనాన్షియల్ స్టాక్స్ కూడా లాభాల నుండి కిందకు పడిపోయాయి.

HDFC బ్యాంకు షేరు నిన్న రూ.1438 వద్ద క్లోజ్ అయింది. నేడు మరో రూ.26 ఎగిసింది. ఆ మధ్యాహ్నం గం.11 నుండి పతనం ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.1.30 సమయానికి HDFC బ్యాంకు స్టాక్ 0.61 శాతం క్షీణించి రూ.1,430 వద్ద ట్రేడ్ అయింది. స్టాక్ రూ.1,464ను తాకిన సమయంలో HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.8 లక్షల కోట్లను దాటి రూ.8.02 లక్షల కోట్లుగా నమోదయింది.

ఈ ఏడాది 14 శాతం లాభపడిన స్టాక్

ఈ ఏడాది 14 శాతం లాభపడిన స్టాక్

ఈ ఏడాది HDFC బ్యాంకు స్టాక్ దాదాపు 14 శాతం లాభపడింది. 2020 జనవరి 1న రూ.1,278గా ఉన్న స్టాక్ ఆ తర్వాత కరోనా నేపథ్యంలో మార్చి 23వ తేదీన రూ.771కు పతనమైంది. కరోనా కారణంగా మార్కెట్లు పతనమైన విషయం తెలిసిందే. అన్-లాక్ తర్వాత మార్కెట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. నెల క్రితం కూడా రూ.1211 వద్ద ఉంది. గత ఐదు సెషన్లుగా స్టాక్ రూ.1369 నుండి రూ.1460 మధ్య ట్రేడ్ అవుతోంది. సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంకు ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన బ్యాంకు లాభాలు 18 శాతం ఎగిసి రూ.7,513 కోట్లుగా నమోదయ్యాయి. నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియే 1.08 శాతం ఉంది.

రిలయన్స్, టీసీఎస్ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ

రిలయన్స్, టీసీఎస్ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ

HDFC బ్యాంకు కంటే ముందు మొదట రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ తర్వాత టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8 లక్షల కోట్లను దాటింది. ప్రస్తుతం భారత కంపెనీల్లోని మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ రూ.13.33 లక్షల కోట్లతో ముందు నిలిచింది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.10.22 లక్షల కోట్లుగా ఉంది.

English summary

బ్యాంకింగ్‌లో ఫస్ట్, మొత్తంగా థర్డ్... HDFC బ్యాంకు సరికొత్త రికార్డ్ | HDFC Bank tops Rs 8 trillion market cap first time

HDFC Bank Ltd crossed ₹8 trillion in market capitalisation for the first time on Wednesday, becoming India's third firm and first lender to achieve this milestone.
Story first published: Wednesday, November 25, 2020, 13:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X