ప్రయివేటురంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఆరుగురు సీనియర్, మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్‌ను తొలగించింది. వీరు బ్యాంకు ప్రవర్తనా నియమావళిని బేఖాతరు చేస్తూ కరప్షన్‌కు పాల్పడినట్లుగా అంతర్గత విచారణలో తేలడంతో వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తొలగించబడిన ఉద్యోగులు ఆటో లోన్ డిపార్టుమెంట్‌కు చెందినవారు. వీరు ఉద్దేశ్యపూర్వకంగా కస్టమర్లు కారు కొనుగోలు చేసినప్పుడు వారితో జీపీఎస్ పరికరాలు కొనుగోలు చేసేలా చూశారు. ఇది బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. మరో విషయం ఏమంటే లోన్ డాక్యుమెంట్స్ చెక్ చేసే వరకు జీపీఎస్ పరికరాలు తప్పనిసరి కాదనే విషయం కస్టమర్లకు తెలియకపోవడం గమనార్హం.

ఎందుకు అలా చేశారు
సదరు ఉద్యోగులు కస్టమర్లతో జీపీఎస్ పరికరాలు కొనుగోలు చేయించడానికి పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ ఉద్యోగులు తమ సేల్స్ టార్గెట్‌ను చేరుకునేందుకు, అలాగే డిఫాల్ట్ అయితే సులభంగా ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందని.. ఇలా వివిధ కోణాల్లో వారు బ్యాంకు నియమావళికి విరుద్ధంగా బలవంతంగా ఉత్పత్తులను కట్టబెట్టారని తెలుస్తోంది. జీపీఎస్ ఉత్పత్తుల విక్రయం కోసం హెచ్‌డీఎప్‌సీ ఇందుకు సంబంధించిన సంస్థతో జత కట్టింది. అయితే అది కస్టమర్ల ఇష్టం. దీనిపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు స్పందించాల్సి ఉంది.

2015-2019 వరకు..
కొందరు కస్టమర్లకు తాము వాహన ట్రాకింగ్ డివైజ్‌లు కొన్నామని కూడా బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియదని విచారణలో వెల్లడైంది. రూ.18,000 నుండి రూ.19,500 విలువైన జీపీఎస్ డివైజ్‌లను 2015 నుండి డిసెంబర్ 2019 వరకు కారు లోన్ తీసుకున్న వారితో సదరు ఉద్యోగులు కొనుగోలు చేయించారు. దీంతో ఉన్నతాధికారులు దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. ముంబైకి చెందిన ఓ ప్రయివేటు కంపెనీ వద్ద ఈ జీపీఎస్ పరికరాలు కొనుగోలు చేయించారని తెలుస్తోంది. ఇలా చేయడం కారు లోన్ తీసుకున్న వారిని మోసం చేసినట్లే అవుతుందని బ్యాంకు ఉన్నతాధికారులు భావించారు. అందుకే వారిని విధుల నుండి తొలగించారు.

అతిపెద్ద వెహికిల్ ఫైనాన్సింగ్ బ్యాంకు
అతిపెద్ద వెహికిల్ ఫైనాన్స్ హెచ్‌డీఎఫ్‌సీ నెలకు దాదాపు 50,000 నుండి 55,000 వరకు కారు లోన్స్ ఇస్తుంది. ఏడాదికి రూ.40,000 కోట్ల వ్యాపారం అవుతుంది. హెచ్‌డీఎఫ్‍సీతో పాటు ఇతర బ్యాంకులు కూడా జీపీఎస్ సహా వివిధ రకాల ప్రోడక్ట్స్‌ను కస్టమర్లు ఎంచుకునే వెసులుబాటును కల్పిస్తుంది. అయితే కారుతో పాటు ఈ కొనుగోళ్లు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications