For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ షాక్ నుండి ఊరట, కార్డ్స్ జారీకి HDFC బ్యాంకుకు అనుమతి

|

కొత్త క్రెడిట్ కార్డ్స్ జారీ చేయకుండా HDFC బ్యాంకు పైన విధించిన నిషేధాన్ని కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఎత్తివేసింది. ఈ మేరకు బ్యాంకింగ్ వర్గాలు వెల్లడించాయి. కొత్త టెక్నాలజీలు తీసుకురావడంపై మాత్రం నిషేధం కొనసాగుతోందని చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో క్రెడిట్ కార్డ్స్ విభాగంలో ముందున్న HDFC బ్యాంకు పైన కొత్త కార్డులు జారీ చేయకుండా ఆర్బీఐ నిషేధం విధించింది. ఇందువల్ల బ్యాంకు ప్రస్తుత ఖాతాదారులపై మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదు.

గత ఏడాది ఆర్బీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ ఫామ్స్‌లో అనేక సందర్భాల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో కొత్త కార్డ్స్ జారీ నిలిపివేయబడ్డాయి. ఇప్పుడు ఆర్బీఐ కొత్త కార్డ్స్‌ను సోర్సింగ్ చేయడానికి బ్యాంకుకు అనుమతి లభించింది. కార్డు జారీపై ఆర్బీఐ నిషేధం విధించడంతో HDFCపై భారీగానే దెబ్బపడింది. దాని కార్డ్ బేస్ గత ఏడాది డిసెంబర్ నెలలో 15.38 మిలియన్ల నుండి జూన్ నాటికి 14.82 మిలియన్లకు పడిపోయింది. HDFC దేశంలోనే అతిపెద్ద క్రెడిట్ కార్డు జారీ చేసే బ్యాంకుగా నిలిచింది.

HDFC Bank can start issuing credit cards again, RBI eases curbs

ఆర్బీఐ గత డిసెంబర్ నెలలో క్రెడిట్ కార్డు జారీ పైన ఆంక్షలు విధించడంతో క్రెడిట్ కార్డు మార్కెట్లో వేగంగా వృద్ధిసాధిస్తోన్న HDFCకి షాక్ తగిలింది. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో కార్డ్ రంగంలో కొంత మార్కెట్ వాటాను కోల్పోయింది. ఎందుకంటే HDFC స్థానాన్ని ఇతర బ్యాంకులు ఆక్రమించాయి. బ్యాంకు హెడ్ ఆఫ్ ది పేమెంట్ బిజినెస్ అండ్ చార్జ్ అఫ్ టెక్నాలజీ ట్రాన్స్‌మిషన్ పరాగ్ రావు గత జూన్ నెలలో మాట్లాడుతూ... తాము క్రెడిట్ కార్డ్ మార్కెట్లో దూసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

English summary

క్రెడిట్ షాక్ నుండి ఊరట, కార్డ్స్ జారీకి HDFC బ్యాంకుకు అనుమతి | HDFC Bank can start issuing credit cards again, RBI eases curbs

In a partial relief to HDFC Bank, the largest private sector bank of the country, the Reserve Bank of India (RBI) has allowed the lender to issue new credit cards, sources in the bank said.
Story first published: Wednesday, August 18, 2021, 9:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X