For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన బంగారం ధరలు, రూ.45,000కి దిగొచ్చిన పసిడి: వెండి కూడా డౌన్

|

బంగారం, వెండి ఫ్యూచర్ ధరలు నేడు (మార్చి 2, మంగళవారం) తగ్గాయి. నిన్న రూ.500 వరకు తగ్గిన బంగారం ధర, నేడు మరింతగా క్షీణించి రూ.45,000 స్థాయికి పడిపోయింది ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,200 వరకు తక్కువగా ఉంది. అమెరికా పార్లమెంటు భారీ ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ద్రవ్యోల్భణానికి దారితీస్తుందని భావిస్తున్నారు. ప్యాకేజీ ప్రభావం పసిడితో పాటు ఈక్విటీ మార్కెట్ల పైన కూడా ఉంటుంది. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ క్రితం సెషన్లో పడిపోయింది. వెండి ధరలు కూడా తగ్గాయి. నేడు రూ.1000 వరకు తగ్గాయి.

రూ.45,000 స్థాయికి బంగారం ధరలు

రూ.45,000 స్థాయికి బంగారం ధరలు

ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు (మంగళవారం, మార్చి 2) ప్రారంభ సెషన్లో రూ.45,000 స్థాయికి తగ్గాయి. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.223.00 (0.49%) తగ్గి రూ.45,085.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,066.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,135.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,984.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,200 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.234.00 (-0.51%) తగ్గ రూ.45,232 వద్ద ట్రేడ్ అయింది. 45,205.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,263.00 వద్ద గరిష్టాన్ని, రూ.45,149.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.67వేల దిగువకు వెండి

రూ.67వేల దిగువకు వెండి

వెండి ధరలు భారీగా తగ్గాయి. నిన్న దాదాపు రూ.1000కి పైగా తగ్గిన ధర నేడు రూ.1000 వరకు తగ్గింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.962.00 (1.43%) తగ్గి రూ.66,460.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,463.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,473.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,251.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,021.00 (-1.48%) తగ్గి రూ.67779.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,001.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,001.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,512.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

స్వల్పంగా పెరిగిన బంగారం

స్వల్పంగా పెరిగిన బంగారం

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. 1750 డాలర్ల దిగువనే ఉంది. ఉదయం సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 11.40

(-0.66%) డాలర్లు తగ్గి 1711.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,704.75 - 1,726.20 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 8.37 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల స్థాయికి దిగి వచ్చింది. ఔన్స్ ధర -0.503 (-1.89%) డాలర్లు పెరిగి 26.175 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.020 - 26.745 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

భారీగా తగ్గిన బంగారం ధరలు, రూ.45,000కి దిగొచ్చిన పసిడి: వెండి కూడా డౌన్ | Gold, silver futures drop up to 0.5 per cent, Yellow metal below rs 46,000

Gold and silver futures fell on Tuesday, even as analysts believe the recent risk-off sentiment may revive safe-haven bets for bullion. Analysts said the upcoming announcement of further stimulus measures by the newly elected US government may support gold, as a perfect hedge against possible inflation.
Story first published: Tuesday, March 2, 2021, 10:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X