For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన బంగారం ధరలు, పెట్రోల్-డీజిల్ ధరలు యథాతథం

|

బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90 పెరిగింది. దీంతో బంగారం రూ.36,250కి చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.90 పెరిగింది. దీంతో రూ.39,600కు చేరుకుంది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్, దేశీయ జ్యువెల్లర్స్ నుంచి, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధరలు కాస్త పెరిగాయి. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. కిలో వెండి రూ.100 పెరిగి రూ.46,800కు చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ఔన్స్ 0.01 శాతం పెరిగింది. 1,480 డాలర్లకు చేరుకుంది. ఔన్స్ వెండి 17.06 డాలర్లకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర సెప్టెంబర్ నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్టస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. అప్పుడు ఔన్సు బంగారం 1,550 డాలర్లకు చేరుకుంది. నాటితో పోలిస్తే భారీగా అంటే ఏకంగా 70 డాలర్లు దిగి వచ్చింది.

FASTag కాస్ట్, డాక్యుమెంటేషన్, కొనుగోలు, రీఛార్జ్FASTag కాస్ట్, డాక్యుమెంటేషన్, కొనుగోలు, రీఛార్జ్

Gold, Silver and Petrol Price in Hyderabad

మరోవైపు, ఇంధన ధరలు మంగళవారం నాటితో యథాతథంగా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.74.63, కోల్‌కతాలో రూ.77.29, ముంబైలో రూ.80.29, చెన్నైలో రూ.77.58, బెంగళూరులో రూ.77.18, హైదరాబాదులో రూ.79.42గా ఉంది. డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.66.04, కోల్‌కతాలో రూ.68.45, ముంబైలో రూ.69.27, చెన్నైలో రూ.69.81, బెంగళూరులో రూ.68.29, హైదరాబాదులో రూ.72.07గా ఉంది.

English summary

పెరిగిన బంగారం ధరలు, పెట్రోల్-డీజిల్ ధరలు యథాతథం | Gold, Silver and Petrol Price in Hyderabad

Petrol prices in Hyderabad have been turning more volatile, as prices of crude oil have been showing a firm trend. It is important to check todays petrol price in Hyderabad ₹ 79.42 (18th December 2019), especially if you are going for a long drive.
Story first published: Wednesday, December 18, 2019, 14:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X