For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold rate today: మళ్లీ తగ్గుతున్న బంగారం ధరలు

|

నిన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు, ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. నిన్న ఓ సమయంలో 51,000 క్రాస్ చేసిన బంగారం ధర ఇప్పుడు ఈ మార్కు దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లోను 1860 డాలర్ల దిగువకు వచ్చింది. ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.5200 తక్కువగా, కామెక్స్‌లో 2075 డాలర్లతో 220 డాలర్లు తక్కువగా ఉంది.

ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో రూ.14 పెరిగి రూ.50,901 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.53 పెరిగి రూ.51,041 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,000 దిగువకు వచ్చింది. నేటి సెషన్‌లో జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.354 తగ్గి రూ.61,528 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.375 తగ్గి రూ.62,225 వద్ద ట్రేడ్ అయింది.

Gold rate today: Yellow metal trades marginally lower

కామెక్స్‌లో ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 2 డాలర్లు తగ్గి 1855 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.099 డాలర్లు తగ్గి 21.871 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రితం సెషన్‌లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1860 డాలర్లకు సమీపంలో ముగిసింది.

English summary

Gold rate today: మళ్లీ తగ్గుతున్న బంగారం ధరలు | Gold rate today: Yellow metal trades marginally lower

Gold prices were trading mildly lower on Tuesday following strong bond yields and strength in the US dollar, which dented the bullion's appeal. The yellow metal is headed for a straight second monthly loss.
Story first published: Tuesday, May 31, 2022, 11:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X