For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన బంగారం, వెండి ధరలు: రూ.49,000 దిగువకు గోల్డ్ ఫ్యూచర్స్

|

బంగారం ధరలు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడం, దేశీయంగా కరోనా కేసులు తగ్గడం వంటి వివిధ అంశాలు ఈక్విటీ మార్కెట్ జోరుకు దోహదపడింది. అదే సమయంలో పసిడిపై ఒత్తిడి తగ్గింది. అంతర్జాతీయంగా, దేశీయంగా కరోనా కేసులు తగ్గడం పసిడి ధరలపై ప్రభావం చూపింది. ఇటీవల రూ.49వేలు దాటిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఈ మార్కు దిగువకు వచ్చాయి. వెండి ధరలు కూడా రూ.71500 దిగువకు క్షీణించాయి. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1890 డాలర్లకు దిగువకు పడిపోయింది. పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7600 తక్కువగా ఉంది.

తగ్గిన బంగారం ధర

తగ్గిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.240.00 (-0.49%) తగ్గి రూ.48884.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,018.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,037.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,811.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.221.00 (-0.45%) తగ్గి రూ.49190.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,325.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,328.00 గరిష్టాన్ని, రూ.49,162.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండిదీ అదే దారి

వెండిదీ అదే దారి

జూలై సిల్వర్ ఫ్యూచర్స్ సాయంత్రం సెషన్లో రూ.464.00 (-0.65%) తగ్గి రూ.71420.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,500.00 వద్ద ప్రారంభమై, రూ.71,570.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.71,257.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.521.00 (-0.71%) తగ్గి రూ.72501.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,645.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.72,734.00 గరిష్టాన్ని, రూ.72,441.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 1890 డాలర్ల దిగువకు వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 10.50 (-0.55%) డాలర్లు తగ్గి 1,885.00 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,878.50 - 1,891.80 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.205 (-0.73%) డాలర్లు తగ్గి 27.797 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.685 - 27.948 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

తగ్గిన బంగారం, వెండి ధరలు: రూ.49,000 దిగువకు గోల్డ్ ఫ్యూచర్స్ | Gold rate today: Yellow metal tepid, silver slips to Rs 71,500

Gold prices were subdued on Thursday, weighed down by a firmer dollar. Investors are on the sidelines waiting for clearer signals on inflation levels and economic growth from the US and the European Central Bank. The yellow metal was trading tepid in domestic markets, with marginal cuts.
Story first published: Thursday, June 10, 2021, 14:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X