For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పెరిగిన బంగారం ధర, అక్కడ రూ.1,200 పెరిగి రూ.43,000 క్రాస్

|

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రారంభంలో పడిపోయిన ధరలు ఆ తర్వాత భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా ఈ రోజు భారీగానే పెరిగాయి. మూడు రోజులుగా ఈ ధరలు పెరుగుతున్నాయి. 45వేల రికార్డ్ ధర నుండి రూ.40వేల దిగువకు చేరుకున్న పసిడి, ఇప్పుడు రూ.43వేల సమీపానికి చేరుకుంది..

భారీగా తగ్గి.. హఠాత్తుగా రూ.1,100 పెరిగిన బంగారం ధర, అక్కడ రోజులో 100 డాలర్లుభారీగా తగ్గి.. హఠాత్తుగా రూ.1,100 పెరిగిన బంగారం ధర, అక్కడ రోజులో 100 డాలర్లు

ఎంసీఎక్స్‌లో బంగారం ధర

ఎంసీఎక్స్‌లో బంగారం ధర

ఎంసీఎక్స్‌లో బంగారం ధర బుధవారం ఉదయం స్వల్పంగా 0.8 శాతం తగ్గి రూ.41,039కి చేరుకుంది. వెండి 0.31 శాతం పెరిగి రూ.40,648కి చేరుకుంది. 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ప్రభావం బంగారంపై పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కూడా ఉంది.

ముంబైలో రూ.1,177 పెరుగుదల

ముంబైలో రూ.1,177 పెరుగుదల

ముంబై బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,177 పెరిగి రూ.43,424కు చేరుకుంది. రూపాయి ప్రభావం దీనిపై ఎక్కువగా పడింది. కేవలం ఆన్ లైన్ వ్యాపారమే ఎక్కువగా జరుగుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో బంగారం దుకాణాలు మూసివేశారు.

రిటైల్ మార్కెట్లో..

రిటైల్ మార్కెట్లో..

ముంబై రిటైల్ మార్కెట్లో 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 39,776 ప్లస్ జీఎస్టీ, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,424 ప్లస్ జీఎస్టీ. 18 క్యారెట్ల గోల్డ్ కోటెడ్ బంగారం రూ.32,568 ప్లస్ జీఎస్టీ ఉంది. ఇక వెండి ధర కిలోకు రూ.575 పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుదల

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుదల

అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1.6 శాతం పెరిగి 1,635.79 డాలర్లకు చేరుకుంది. మార్చి 12వ తేదీ నుండి ఇది అత్యధిక ధర. ఇతర అతి ఖరీదైన మెటల్స్ విషయానికి వస్తే వెండి ధర 1.6 శాతం పెరిగి $14.49, ప్లాటినం ధర 9 శాతం పెరిగి 729.49 డాలర్లుగా ఉంది.

English summary

భారీగా పెరిగిన బంగారం ధర, అక్కడ రూ.1,200 పెరిగి రూ.43,000 క్రాస్ | Gold rate today: old price tops Rs 43,000

Gold price rose Rs 1,177 to Rs 43,424 per 10 gram in the Mumbai bullion market on a weaker dollar, but the gains were capped by a stronger rupee. The major gold trading centres have been shut due to lockdown announced by state governments to prevent the spread of coronavirus disease with only online sales taking place.
Story first published: Wednesday, March 25, 2020, 22:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X