For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? హైదరాబాద్‌లో రూ.39,500

|

బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంసీఎక్స్ గోల్డ్ (డిసెంబర్) ఫ్యూచర్స్ 0.22 శాతం పెరిగి రూ.37,802గా ఉంది. ఎంసీఎక్స్ వెండి (డిసెంబర్) ఫ్యూచర్స్ 0.55 శాతం పెరిగి కిలో రూ.44,130గా ఉంది. కాగా, బంగారం ధరలు గత రెండు నెలల్లో రూ.2400 తగ్గింది. ఎంసీఎక్స్‌లో సెప్టెంబర్ నెలలో రూ.40,000 గరిష్టాన్ని తాకింది.

మధ్య తరగతి భక్తులకు భారం: తిరుమలలో గదుల ధర రెండింతలుమధ్య తరగతి భక్తులకు భారం: తిరుమలలో గదుల ధర రెండింతలు

అమెరికా - చైనా వాణిజ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీనిపై ఏం జరుగుతుందో ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర మంగళవారం 1,450 డాలర్లుగా ఉండగా ఈ రోజు స్వల్పంగా పెరిగింది. అయితే అమెరికా - చైనా ట్రేడ్ టాక్స్ సానుకూలంగా కనిపిస్తే అంతర్జాతీయంగా బంగారం ధరలు ఔన్సుకు 1450 డాలర్లు దిగువకు, భారత్‌లో రూ.37500 దిగువకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

 Gold Rate Today: Gold, silver shine on safe haven demand

బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.39,510గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,220గా ఉంది. కిలో వెండి ధర రూ.48,750కి చేరుకుంది. ఢిల్లీలో బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు.

English summary

బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? హైదరాబాద్‌లో రూ.39,500 | Gold Rate Today: Gold, silver shine on safe haven demand

MCX Gold (Dec) futures edged 0.22 per cent higher to Rs 37,802 while MCX Silver (Dec) futures gained 0.55 per cent to Rs 44,130.
Story first published: Wednesday, November 13, 2019, 14:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X