For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాన్నాళ్లకు నిలకడగా బంగారం ధరలు, ఎక్కడెంత అంటే

|

కరోనా రికవరీలు పెరగడం, వ్యాక్సీన్ పైన ఆశాజనక వార్తలతో ఈక్విటీ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. ఇది బంగారంపై ఒత్తిడిని తగ్గించింది. భారత్ నుండి అంతర్జాతీయ మార్కెట్ల వరకు క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలో పసిడి ధరపై క్రమంగా ప్రభావం పడుతోంది. అంతకుముందు వరుసగా భారీగా పెరిగిన ధర.. ఆ మేరకు తగ్గక పోయినప్పటికీ పెరుగుదలకు చెక్ పడింది. బంగారం ధరలు ఈ రోజు (జూలై 16) తగ్గాయి.

అక్కడ పెరిగి, ఇక్కడ తగ్గి.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే! మరింత పెరగొచ్చు...అక్కడ పెరిగి, ఇక్కడ తగ్గి.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే! మరింత పెరగొచ్చు...

తగ్గిన బంగారం ధర

తగ్గిన బంగారం ధర

ఉదయం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.04 శాతం తగ్గి రూ.49,137 పలికింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.13 శాతం పడిపోయి కిలో రూ.52,990 వద్ద ట్రేడ్ అయింది. బంగారం, వెండి ధరలు నిన్న (జూలై 15) ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఔన్స్ ధర 0.3 శాతం తగ్గి 1,805.62 డాలర్లు పలికింది. గత వారం 2011 సెప్టెంబర్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పుడు స్వల్పంగా తగ్గింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి 1,807.90 డాలర్లు పలికింది.

హైదరాబాద్‍, విశాఖ, విజయవాడల్లో

హైదరాబాద్‍, విశాఖ, విజయవాడల్లో

ఢిల్లీ మార్కెట్లో నేడు బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గి రూ.50,000 దిగువకు వచ్చింది. 22 క్యారెట్ల బంగారం రూ.48,000 దిగువకు వచ్చింది. హైదరాబాద్‍, విశాఖ, విజయవాడల్లో 24 క్యారెట్ల బంగారం రూ.120 పెరిగి రూ.51,290కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం రూ.47,130 పలికింది.

నిన్న పెరుగుదల.. తగ్గుదల

నిన్న పెరుగుదల.. తగ్గుదల

బుధవారం ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములు రూ.244 పెరిగి రూ.50,230 పలికింది. వెండి ధర కిలోకు రూ.673 పెరిగి రూ.54,200 పలికింది. 24 క్యారెట్ల బంగారం హైదరాబాద్‌లో రూ.70 తగ్గి రూ.51,170కి దిగి వచ్చింది. 22 క్యారెట్ల పసిడి రూ.46,910 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లోకి రావడంతో ఈ ప్రభావం పసిడిపై పడి తగ్గిందని, ఇది దేశీయ మార్కెట్లోను ప్రభావం చూపిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

English summary

చాన్నాళ్లకు నిలకడగా బంగారం ధరలు, ఎక్కడెంత అంటే | Gold rate today falls as traders book profits

Gold and silver continued their slide as traders preferred to book profits on Thursday given the upward momentum in equities that is rising on optimism over a successful COVID-19 vaccine trial.
Story first published: Thursday, July 16, 2020, 17:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X