For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు

|

అంతర్జాతీయస్థాయిలో బంగారం ధరలో పెద్దగా మార్పులు లేవు. అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడ్ రేట్లను మార్చడం లేదు. ఈ నేపథ్యంలో పసిడికి కలిసి వచ్చింది. అయితే భారత్‌లో మాత్రం బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాదు మార్కెట్లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.40 వరకు తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.30 తగ్గింది. దేశీయ జ్యువెల్లర్స్, కొనుగోలుదారులనుంచి డిమాండ్ మందగించడంతో బంగారం స్వల్పంగా తగ్గిందని చెబుతున్నారు.

తొలిసారి జగన్ స్కీం: రోజుకు రూ.225, డబ్బులు అందకుంటే..తొలిసారి జగన్ స్కీం: రోజుకు రూ.225, డబ్బులు అందకుంటే..

ఢిల్లీలో బంగారం ధరలో మార్పు లేదు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.37,900 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.36,700 వద్ద స్థిరంగా ఉంది. పసిడి నిలకడగా ఉంటే వెండి ధర మాత్రం పడిపోయింది. కిలో వెండి ధర రూ.90 తగ్గి, రూ.47,400 వద్ద ఉంది.

Gold rate today: Bullion gains as Fed keeps rates unchanged

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం అంతకుముందు 0.02 శాతం తగ్గి 1,478.95 డాలర్ల వద్ద ఉంది. వెండి ఔన్స్ 0.02 శాతం పెరిగి 16.92 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో బంగారం 10 గ్రాములు సెప్టెంబర్ నెలలో రూ.40,000 మార్క్ దాటిన విషయం తెలిసిందే. అలాగే, అమెరికా - చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలోను బంగారం ఔన్స్ 1,550తో ఆరేళ్ల గరిష్టానికి చేరుకుంది. ఇప్పుడు గురువారం బంగారం ధరలు ఏడు రోజుల గరిష్టానికి చేరుకున్నాయి.

English summary

బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు | Gold rate today: Bullion gains as Fed keeps rates unchanged

Bullion counters gained on Thursday after the US central bank decided to keep rates unchanged and added that more rate changes were unlikely in 2020.
Story first published: Thursday, December 12, 2019, 13:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X