For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐదు వారాల తర్వాత పెరిగిన బంగారం ధర.. ఇంకా పెరుగుతుందా లేక తగ్గుతుందా..?

|

గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర సోమవారం కాస్త పెరిగింది. US డాలర్‌లో పుల్‌బ్యాక్ కారణంగా సోమవారం బంగారం ధరలు పెరిగాయి. దాదాపు ఐదు వారాల తర్వాత పుత్తడి ధర పెరిగింది. MCX NSE 0.48%లో గోల్డ్ ఫ్యూచర్లు దాదాపు 0.45 శాతం లేదా రూ. 223 పెరిగి 10 గ్రాముల బంగారానికి రూ. 50,330 వద్ద ట్రేడవుతోంది.

వడ్డీ రేట్లు..

వడ్డీ రేట్లు..

అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి జూలై 26-27 మధ్య జరిగే ఫెడ్ సమావేశంలో 75 bps రేటు పెంచుతామని అధికారులు గత శుక్రవారం తెలిపారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) 25 bps రేట్లు పెంచుతుందని భావిస్తున్నారు. "ఈ వారం బ్యాంక్ ఆఫ్ జపాన్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సమావేశాలకు ముందు US కరెన్సీ బలపడుతుందని" నిపుణులు అభిప్రాయపడ్డారు.

రూ.1900 తగ్గింది..

రూ.1900 తగ్గింది..

ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం శుక్రవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.50,403గా ఉండగా, వెండి కిలో ధర రూ.54,767గా ఉంది. గత తొమ్మిది ట్రేడింగ్ సెషన్లలో బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ. 1,900 పడిపోయింది. అదే సమీక్ష సమయంలో వెండి కిలోకు రూ. 3,400 తగ్గింది.

గ్లోబల్ మార్కెట్లు..

గ్లోబల్ మార్కెట్లు..

గత వారం దాదాపు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి 1,713.49 డాలర్లకు చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి $1,711.80కి చేరుకుంది. మిగిలిన చోట్ల, స్పాట్ వెండి ఔన్స్‌కు 0.4 శాతం పెరిగి 18.76 డాలర్లు, ప్లాటినం 0.8 శాతం పెరిగి 857.30 డాలర్లకు, పల్లాడియం 2.2 శాతం పెరిగి 1,869.10 డాలర్లకు చేరుకుంది.

English summary

ఐదు వారాల తర్వాత పెరిగిన బంగారం ధర.. ఇంకా పెరుగుతుందా లేక తగ్గుతుందా..? | Gold rate increase after 5weeks in india bulian market

Gold prices were trading higher on Monday, thanks to the pullback in the US dollar.The dollar slipped against its rivals, moving further away from a near 20-year high hit last week, making greenback-priced bullion less expensive for buyers holding other currencies.
Story first published: Monday, July 18, 2022, 15:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X