For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వల్పంగా పెరిగిన బంగారం ధర: ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9300 తక్కువ

|

ముంబై: బంగారం, వెండి ధరలు నేడు (జూన్ 25, శుక్రవారం) స్వల్పంగా పెరిగాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి ధరలు గతవారం భారీగా క్షీణించాయి. ఈ వారం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. నేటి మధ్యాహ్నం సెషన్ వరకు ఈ వారంలో పసిడి ధరలు అతి స్వల్ప క్షీణత లేదా స్థిరంగా ఉన్నాయి. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47000 దిగువనే ఉంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే గోల్డ్ ఫ్యూచర్స్ రూ.9300 తక్కువగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టంతో రూ.11,000 వరకు తక్కువగా ఉంది. గోల్డ్ నేడు రూ.100 వరకు పెరగగా, సిల్వర్ రూ.400కు పైగా పెరిగింది.

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి మధ్యాహ్నం సెషన్లో రూ.90.00 (0.19%) పెరిగి రూ.46960.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,948.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,970.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.46,835.00 కనిష్టాన్ని తాకింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.87.00 (0.18%) పెరిగి రూ.47255.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,180.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,255.00 గరిష్టాన్ని, రూ.47,169.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధరలు రూ.500 జంప్

వెండి ధరలు రూ.500 జంప్

జూలై సిల్వర్ ఫ్యూచర్స్ మధ్యాహ్నం సెషన్లో రూ.429.00 (0.63%) పెరిగి రూ.68162.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,109.00 వద్ద ప్రారంభమై, రూ.68,300.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.67,756.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.445.00 (0.65%) పెరిగి రూ.69194.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,925.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,282.00 గరిష్టాన్ని, రూ.68,800.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం నేడు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 3.45 (0.19%) డాలర్లు పెరిగి 1,780.15 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,773.65 - 1,781.30 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.160 (0.61%) డాలర్లు పెరిగి 26.210 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.968 - 26.273 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

స్వల్పంగా పెరిగిన బంగారం ధర: ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9300 తక్కువ | Gold rate inches up, silver nears Rs 68,000

Gold prices held steady as investors awaited US inflation data due later in the day after mixed signals from Federal Reserve officials this week on interest rate hikes.
Story first published: Friday, June 25, 2021, 13:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X