For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price today: ధన్‌తెరాస్‌కు ముందు తగ్గుతున్న బంగారం ధరలు

|

వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు (అక్టోబర్ 29, శుక్రవారం) క్షీణించాయి. నేటి ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.171.00 (-0.36%) క్షీణించి రూ.47790.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.152.00 (-0.32%) తగ్గి రూ.47870.00 వద్ద ట్రేడ్ అయింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్ నెలలో బంగారం రూ.56,200తో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. అయితే ఆ తర్వాత క్షీణిస్తూ వచ్చింది. సెకండ్ వేవ్ అనంతరం ఓ సమయంలో రూ.44,000 దిగువకు పడిపోయింది. మళ్లీ కొనుగోలుదారులకు షాకిస్తూ పెరుగుతూ వచ్చింది.

ఈ వారం కూడా గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000ను క్రాస్ చేసింది. నిన్నటి వరకు లాభపడిన బంగారం, నేడు క్షీణించింది. నేడు బంగారం రూ.200 వరకు తగ్గింది. ఇక వెండి ధరలు కూడా రూ.65,000 దిగవకు పడిపోయాయి. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.580.00 (-0.89%) తగ్గి రూ.64351.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.566.00 (-0.86%) క్షీణించి రూ.65086.00 వద్ద ట్రేడ్ అయింది.

నిన్న ధరలు ఇలా...

నిన్న ధరలు ఇలా...

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.26.00 (0.05%) పెరిగి రూ.47988.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.14.00 (0.03%) పెరిగి రూ.48033.00 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గినప్పటికీ అతి స్వల్పమే. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.235.00 (-0.36%) క్షీణించి రూ.64930.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.199.00 (-0.30%) తగ్గి రూ.65640.00 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 1800 డాలర్ల దిగువనే ట్రేడ్ అవుతున్నాయి. నిన్న 1800 డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, నేడు గోల్డ్ ఫ్యూచర్స్ 6.45 (-0.36%) డాలర్లు క్షీణించి 1,796.15 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 24 డాలర్ల దిగువకు వచ్చింది. నేడు 0.137

(-0.57%) డాలర్లు క్షీణించి 23.983 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

వివిధ నగరాల్లో ధరలు

వివిధ నగరాల్లో ధరలు

- ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.47,050.

- చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.45,250.

- ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.47,100.

- కోల్‌కతాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.47,350.

- బెంగళూరులో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.44,950.

- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.44,950.

- కేరళలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.44,950.

- పుణేలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.46,320.

- అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.46,170.

English summary

Gold Price today: ధన్‌తెరాస్‌కు ముందు తగ్గుతున్న బంగారం ధరలు | Gold rate down ahead of Dhanteras

Gold price continues to drop bringing cheers for common buyers ahead of Diwali and Dhanteras.
Story first published: Friday, October 29, 2021, 11:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X