For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.48,000 పైనే బంగారం ధరలు, వెండి రూ.68,000 స్థాయికి డౌన్

|

బంగారం ధరలు వరుసగా నాలుగో వారం లాభపడుతున్నాయి. క్రితం వారం బంగారం రూ.400 వరకు పెరిగింది. చివరి సెషన్లో భారీగా తగ్గింది. సోమవారం (జూలై 19) ప్రారంభ సెషన్‌‌లో గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. రూ.48,000కు పైనే కదలాడుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.68,000 స్థాయికి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు తగ్గాయి.

ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో రూ.73.00 (0.15%) పెరిగి రూ.48126.00 వద్ద ట్రేడ్ అయింది. గతవారం ఓ సమయంలో రూ.48500 స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత చివరి సెషన్లో తగ్గింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.95.00 (0.20%) పెరిగి రూ.48380.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ప్యూచర్స మాత్రం తగ్గింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.269.00 (-0.39%) క్షీణించి రూ.68050.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.275.00 (-0.39%) తగ్గి రూ.69380.00 వద్ద ట్రేడ్ అయింది.

Gold rally extends to fourth week, Gain on lower US bond yields, virus worries

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ దాదాపు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ +0.80 (+0.04%) డాలర్లు పెరిగి 1815.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.208 (-0.81%) డాలర్లు తగ్గి 25.587 డాలర్ల వద్ద కదలాడింది. యూఎస్ బాండ్ యీల్డ్స్ తగ్గడం, వైరస్ ఆందోళనలు పెరగడంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది.

English summary

రూ.48,000 పైనే బంగారం ధరలు, వెండి రూ.68,000 స్థాయికి డౌన్ | Gold rally extends to fourth week, Gain on lower US bond yields, virus worries

Gold prices edged higher on Monday as a fall in US Treasury yields and concerns over a global economic recovery slowdown due to the spread of the Delta variant of the coronavirus lifted demand for the safe haven metal.
Story first published: Monday, July 19, 2021, 9:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X