For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గతవారం తగ్గిన బంగారం ధరలు, ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8500 డౌన్

|

ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై కస్టమ్స్ డ్యూటీని 12.5 శాతం నుండి 7.5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో భారీ ఊరట కల్పించారు. బంగారంపై కస్టమ్స్ డ్యూటీ ప్రస్తుతం 12.5 శాతంగా ఉంది. 2019 జూలై వరకు ఇది 10 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా, పసిడి ధరలు గతవారం భారీగా తగ్గుముఖం పట్టాయి. రూ.49,000కు పైగా ప్రారంభమైన పది గ్రాముల పసిడి రూ.48,000 దిగువన క్లోజ్ అయ్యాయి. ఈ వారం పసిడి ధరలు దాదాపు రూ.1300 వరకు తగ్గాయి. ఆల్ టైమ్ గరిష్టంతో పసిడి ధరలు ఇప్పటికీ రూ.8500 వరకు తక్కువగా ఉంది. గతవారం మొత్తంగా తగ్గిన పసిడి, చివరి సెషన్లో మాత్రం పెరిగింది.

47,000 పైకి పసిడి

47,000 పైకి పసిడి

ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్లో (శుక్రవారం, ఫిబ్రవరి 5వ తేదీ) 555.00 (1.19%) పెరిగి రూ.47270.00 వద్ద ముగిసింది. చివరి సెషన్లో రూ.46,850.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,315.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,806.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8500 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.493.00 (1.05%) పెరిగి రూ.47,335 వద్ద ముగిసింది. రూ.46,982.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,444.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,955.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.1800 జంప్

వెండి రూ.1800 జంప్

వెండి ధర కూడా పెరిగింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 1,853.00 (2.77%) పెరిగి రూ.67210.00 వద్ద ముగిసింది. చివరి సెషన్లో రూ.67,210.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,823.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,205.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.1,787.00 (2.63%) పెరిగి రూ.68,200.00 ముగిసింది. రూ.68,200.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,862.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,200.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల పైకి పసిడి

1800 డాలర్ల పైకి పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా తగ్గినప్పటికీ, మళ్లీ పెరిగి 1800 డాలర్ల పైకి చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 23.90 (+1.33%) డాలర్లు పెరిగి 1815.10 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం సెషన్లో 1,792.25 - 1,815.85 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.04% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.783 (+2.98%) డాలర్లు పెరిగి 27.017 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.258 - 27.102 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 50.31 శాతం పెరిగింది.

English summary

గతవారం తగ్గిన బంగారం ధరలు, ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8500 డౌన్ | Gold prices tumble during the week, silver sees a mixed trend

Union finance minister Nirmala Sitharaman on Monday announced a cut in customs duty on gold and silver to 7.5% from 12.5%.
Story first published: Saturday, February 6, 2021, 13:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X