For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు

|

బంగారం ధరలు క్రితం సెషన్‌లో భారీగా పెరిగాయి. నేడు (ఏప్రిల్ 13, బుధవారం) మాత్రం స్వల్పంగా క్షీణించాయి. నిన్న రూ.52,200 దిగువన ప్రారంభమైన గోల్డ్ ఫ్యూచర్స్ ముగింపు సమయానికి రూ.52,900ను సమీపించింది. రూ.52,875కు పైన క్లోజ్ అయింది. అంటే దాదాపు రూ.700 పెరిగింది. పసిడి చాన్నాళ్లకు రూ.53,000కు చేరువైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పసిడి ధరలు రూ.55,000 క్రాస్ చేశాయి. ఇటీవల రూ.51,000 దిగువకు పడిపోయినప్పటికీ మళ్లీ రూ.53,000కు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు 1975 డాలర్ల దిశగా పరుగు పెట్టాయి.

నిన్న రూ.700 జంప్

నిన్న రూ.700 జంప్

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.3 క్షీణించి రూ.52,875 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.10 క్షీణించి రూ.53,115 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.52,875ను క్రాస్ చేసింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా భారీగానే పెరిగింది.

నిన్న సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు రూ.1500కు పైగా ఎగిసిపడింది. మే సిల్వర్ ఫ్యూర్స్ నిన్న రూ.67,300 స్థాయి నుండి ఏకంగా రూ.68,800ను సమీపించింది. నేడు ఉదయం మరో రూ.114 పెరిగి రూ.68,904 వద్ద ట్రేడ్ అయింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.139 పెరిగి రూ.69,601 వద్ద ట్రేడ్ అయింది.

1970 డాలర్లకు పైన

1970 డాలర్లకు పైన

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1970 డాలర్లను క్రాస్ చేసింది. రెండు రోజుల క్రితం 1950 డాలర్ల దిగువన ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు 1970 డాలర్లు క్రాస్ అయింది. క్రితం సెషన్‌లో 1976 డాలర్లకు పైన ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.35 డాలర్లు క్షీణించి 25.695 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 25.735 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

పసిడికి ఇవి సానుకూలం

పసిడికి ఇవి సానుకూలం

అమెరికా ద్రవ్యోల్భణం డేటా విడుదలకు ముందు బంగారం ధరలు ఊగిసలాటలో కనిపిస్తున్నాయి. నిన్న భారీగా పెరిగి, నేడు స్వల్పంగా తగ్గుతున్నాయి. అయితే పెరుగుతున్న చమురు ధరలు, ద్రవ్యోల్భణ ఆందోళనలు, మందగించిన ప్రపంచ వృద్ధి పసిడికి సానుకూలం అంశాలు.

English summary

Gold Prices Today: నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు | Gold Prices Today: To stay positive amid inflation fears, rising oil prices

Gold prices were flat on April 13 in the international markets, after gaining as much as 1% in the last session, as Treasury yields eased after US inflation data and concerns over Ukraine conflict supported safe-haven bids, while a firm dollar capped bullion's gains.
Story first published: Wednesday, April 13, 2022, 10:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X