ముంబై: దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు నేడు (ఫిబ్రవరి 18, గురువారం) స్వల్పంగా కోలుకున్నాయి. నిన్న రూ.46,250 దిగువకు పడిపోయిన బంగారం నేడు రూ.46,400 క్రాస్ చేసింది. ఇప్పటికీ ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో దాదాపు రూ.10,000 తక్కువగా ఉంది. గత ఐదు సెషన్లలో బంగారం ధరలు దాదాపు రూ.2000 క్షీణించాయి. వెండి ధరలు కూడా నేడు స్వల్పంగా పెరిగినప్పటికి, కిలో రూ.70,000 దిగువనే ఉన్నాయి. ఇటీవల ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. అదే సమయంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి.

రూ.46,400 దిగువకు బంగారం
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.176.00 (0.38%) పెరిగి రూ.46,413.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,409.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,476.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,403.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10000 వరకు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.202.00 (0.44%) పెరిగి రూ.46,590 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,571.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,590.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,570.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.69,000 పైకి వెండి
వెండి ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. ఉదయం గం.10.30 సమయానికి రూ.69,000 పైకి చేరుకున్నాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.115.00 (0.17%) పెరిగి రూ.69,346.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,400.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,639.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,310.00 వద్ద కనిష్టాన్ని తాకింది.మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.183.00 (0.26%) పెరిగి రూ.70,566.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,682.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,682.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,469.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల దిగువనే పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగినప్పటికీ, 1800 డాలర్లకు దిగువనే ఉంది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 8.45(0.48%) డాలర్లు పెరిగి 1781.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,775.10 - 1,784.55 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 9.58 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.052 (0.19%) డాలర్లు పెరిగి 27.370 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.305 - 27.595 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 49.87 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Silver: వెండి ధర కిలో రూ.2 లక్షల కంటే కిందకు పడిపోదా? నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications