For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 రోజులుగా ఒత్తిడిలో బంగారం ధరలు, 8 నెలల కనిష్టానికి

|

ముంబై: పసిడి ధరలు వరుసగా నాలుగో రోజు ఒత్తిడిలో ఉన్నాయి. ఇటీవల బంగారం ధరలు వరుసగా తగ్గాయి. అడపాదడపా పెరిగినప్పటికీ అతి స్వల్పంగా మాత్రమే. నేడు కూడా ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.10,000కు పైగా తక్కువగా ఉన్నాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో రూ.69వేలకు దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం, వెండి ధరలు తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ భారీగా తగ్గి 17700 డాలర్లకు దిగువకు వచ్చింది. వెండి మాత్రం 27వేల నుండి 28 డాలర్ల మధ్యే కదలాడుతోంది.

పసిడి 10 గ్రాములు రూ.46,200

పసిడి 10 గ్రాములు రూ.46,200

ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర స్థిరంగా ఉంది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.24.00 (0.05%) తగ్గి రూ.46,217.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,340.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,340.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,185.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 వరకు తక్కువగా ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.24.00 (0.05%) తగ్గి రూ.46,371 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,413 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,470 వద్ద గరిష్టాన్ని, రూ.46,371 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి స్వల్ప తగ్గుదల

వెండి స్వల్ప తగ్గుదల

వెండి ధరలు కూడా తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.576.00 (0.83%) తగ్గి రూ.68,700.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,400.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,400.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,505.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో రూ.604.00 (0.85%) పెరిగి రూ.70,072.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,300.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,388.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మరింత తగ్గిన బంగారం ధర

మరింత తగ్గిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడూ తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 4.75 (-0.27%) డాలర్లు పెరిగి 1770.65 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,763.80 - 1,773.75 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 6.27 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ తగ్గింది. ఔన్స్ ధర 0.352(-1.27%) డాలర్లు పెరిగి 27.285 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.100 - 27.570 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

4 రోజులుగా ఒత్తిడిలో బంగారం ధరలు, 8 నెలల కనిష్టానికి | Gold prices today near 8 month lows, down ₹10,000 from record highs

Gold struggled in Indian markets for the fourth day in a row and remained near 8-month lows. On MCX, gold futures were up 0.12% to ₹46,297 per 10 gram while silver futures were down 0.4% to ₹68,989 per kg. The precious metal has been under pressure since the start of this year amid hopes of faster global economic recovery and rising US bond yields.
Story first published: Friday, February 26, 2021, 10:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X