For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర, వచ్చే ఏడాది రికార్డ్ పెరుగుదల!

|

బంగారం ధరలు వరుసగా ఐదో రోజు (మంగళవారం, 10, డిసెంబర్) కాస్త తగ్గాయి. ఎంసీఎక్స్ ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్ ధర 10 గ్రాములకు 0.03 శాతం తగ్గి రూ.37,570గా ఉంది. వరుసగా ఈ ఐదు రోజుల్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.750 తగ్గింది. ఇటీవల వరుసగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఐదు సెషన్లలో భారీగా తగ్గినట్లే. సెప్టెంబర్ నెలలో బంగారం రూ.40,000 మార్క్ దాటి రికార్డ్ సృష్టించింది. నాటి రికార్డుతో ఈ రోజు వరకు తగ్గిన ధర రూ.2,450కి పైగా ఉంది. వెండి ధర కూడా తగ్గింది. ఎంసీఎక్స్ సిల్వర్ ధర 0.09 శాతం తగ్గి కిలో రూ.43,465గా ఉంది.

రూ.2,400 తగ్గినా బంగారం కొనుగోలుకు ఆసక్తి లేదు.. ఎందుకంటే?రూ.2,400 తగ్గినా బంగారం కొనుగోలుకు ఆసక్తి లేదు.. ఎందుకంటే?

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

స్వల్పంగా తగ్గిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. ఔన్స్ బంగారం ఈ రోజు 1,460.95 డాలర్లుగా ఉంది. చైనా అమెరికా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం పడుతోంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి చైనీస్ ఉత్పత్తులపై అమెరికా టారిఫ్ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈ డెడ్ లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారంపై ప్రభావం పడుతోంది. పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

బంగారంపై వీటి ప్రభావం

బంగారంపై వీటి ప్రభావం

ఈ వారాంతంలో అమెరికా టారిఫ్ పెంచకముందే సాధ్యమైనంత త్వరగా అగ్ర రాజ్యంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని బీజింగ్ భావిస్తోందని చైనాకు చెందిన ఓ అధికారి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోంది. వాణిజ్య చర్చలపై ఆశావాదం బంగారంపై ఒత్తిడిని తీసుకు వస్తోంది. గోల్డ్ ట్రేడర్స్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ మీటింగ్ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు.

14 శాతం వర్సెస్ 19 శాతం

14 శాతం వర్సెస్ 19 శాతం

అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది బంగారం ధరలు 14 శాతం వరకు పెరిగాయి. అమెరికా - చైన వాణిజ్య యుద్ధం, ప్రపంచ ముఖ్య ఆర్థిక వ్యవస్థల్లో సులభమైన మానిటరీ పాలసీ, నిరంతర కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు వంటి వాటి కారణంగా ధరలు పెరిగాయి. భారత్ విషయానికి వస్తే ప్రపంచ పెరుగుదల కంటే ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 14 శాతం పెరగగా, దేశంలో 19 శాతానికి పైగా పెరిగింది. ఇందుకు దిగుమతి సుంకం పెరగడం, అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గడం వంటి కారణాలు ఉన్నాయి.

వచ్చే ఏడాది భారీగా పెరగొచ్చు

వచ్చే ఏడాది భారీగా పెరగొచ్చు

ఇదిలా ఉండగా, 2020లో కూడా బంగారం ధరలు దూసుకెళ్లవచ్చునని బులియన్ మార్కెట్ అంచనా వేస్తోంది. అంతర్జాతీయస్థాయిలో ఔన్స్ బంగారం ధర 1,600 డాలర్లకు చేరుకోవచ్చునని భావిస్తున్నాయి. 2013 రికార్డ్ స్థాయికి చేరుకోవచ్చునని చెబుతున్నాయి. అంటే మన వద్ద ఈ ధర రూ.40,000 మార్క్ దాటే అవకాశాలు ఉన్నాయి.

English summary

5 రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర, వచ్చే ఏడాది రికార్డ్ పెరుగుదల! | Gold prices today fall for 5th day in a row, down ₹750 per 10 gram so far

Gold prices today remained weak in Indian markets, falling for the fifth straight day amid weak global cues. On MCX, February gold futures were down 0.03% to ₹37,570 per 10 gram.
Story first published: Tuesday, December 10, 2019, 13:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X