For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాలుగో రోజు తగ్గిన ధరలు: రూ.50,200 దిగువకు పసిడి, రూ.2,000 తగ్గిన వెండి

|

ముంబై: కరోనా వ్యాక్సీన్‌పై సానుకూల ప్రకటనల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఒత్తిడి తగ్గి, ధరలు క్షీణిస్తున్నాయి. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఫైజర్, మోడర్నా తదితర సంస్థలు తమ వ్యాక్సీన్ 95 శాతం మేర సత్ఫలితాలు ఇచ్చిందని ప్రకటించడం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడానికి దోహదపడింది. ఈక్విటీ మార్కెట్లు సరికొత్త రికార్డులను తాకుతున్నాయి. దీంతో పసిడి ధరలు నాలుగు రోజులుగా తగ్గుతున్నాయి.

నిన్న భారీగా తగ్గిన బంగారం నేడు ప్రారంభ సెషన్‌లో మరింత క్షీణించింది. గతవారం రూ.1200 క్షీణించగా, ఈ వారంలో ఇప్పటి వరకు రూ.600కు పైగా తగ్గింది. నిన్న (బుధవారం) డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 438.00 (-0.86%) క్షీణించి రూ.50,328.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.426.00 (-0.84%) తగ్గి రూ.50398.00 వద్ద ముగిసింది. వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.718.00 (-1.14%) తగ్గి రూ.62530.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.694.00 (-1.07%) క్షీణించి రూ.64399.00 వద్ద ముగిసింది.

రూ.50,200 దిగువకు పసిడి ధరలు

రూ.50,200 దిగువకు పసిడి ధరలు

గురువారం (నవంబర్ 19) ఉదయం గం.9.25 సమయానికి 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.160.00 (-0.32%) తగ్గి రూ.50165.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,200.00 ప్రారంభమైన ధర, రూ.50,200.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,149.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.183.00 (-0.36%) క్షీణించి 10 గ్రాముల ధర రూ.50,190.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,197.00 వద్ద ప్రారంభమై, రూ.50,206.00 గరిష్టాన్ని, రూ.50,190.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

పసిడి ధరలు రూ.50,200 దిగువకు వచ్చాయి.

రూ.2వేలు తగ్గిన వెండి ధరలు

రూ.2వేలు తగ్గిన వెండి ధరలు

సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.413.00 (-0.66%) తగ్గి రూ.62,130.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,091.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.62,160.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,001.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.394.00 (-0.61%) క్షీణించి రూ.64000.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,983.00 వద్ద ప్రారంభం కాగా, రూ.64,000.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,950.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఈ వారంలో రూ.64వేల వరకు ఉన్న పసిడి ధరలు ఇప్పుడు 62వేలకు వచ్చాయి ఈ నాలుగు సెషన్‌లలో రూ.2వేల వరకు క్షీణించింది.

1866 డాలర్ల వద్ద..

1866 డాలర్ల వద్ద..

అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి, వెండి ధరలు క్షీణించాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 7.55 (-0.40%) క్షీణించి 1866.40 డాలర్లు పలికింది. క్రితం సెషన్‌లో 1,873.90 వద్ద క్లోజ్ అయింది. 1,864.40 - 1,872.60 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో పసిడి 25 శాతం వరకు పెరిగింది.

వెండి ధర 0.190 (-0.78%) క్షీణించి ఔన్స్ ధర 24.258 డాలర్లు పలికింది. 24.192 - 24.422 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.448 డాలర్లు పలికింది. ఏడాదిలో వెండి ధర దాదాపు 40 శాతం పెరిగింది.

English summary

నాలుగో రోజు తగ్గిన ధరలు: రూ.50,200 దిగువకు పసిడి, రూ.2,000 తగ్గిన వెండి | Gold prices today fall for 4th day to below 50,200

Gold prices today fall for 4th day to below 50,200
Story first published: Thursday, November 19, 2020, 9:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X