For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.10,000 కంటే ఎక్కువ డౌన్: రూ.46,000 వద్ద బంగారం ధరలు, వెండి రూ.68,000 దిగువకు

|

ముంబై: ఫ్యూచర్ మార్కెట్లో నేడు (ఫిబ్రవరి 18, గురువారం) బంగారం ధరలు స్థిరంగా లేదా అతి స్వల్పంగా తగ్గాయి. నిన్న రూ.46,250 దిగువకు పడిపోయిన బంగారం నేడు ఉదయం రూ.46,400 క్రాస్ చేసినప్పటికీ, సాయంత్రం సెషన్లో క్షీణించింది. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో దాదాపు రూ.10,000 తక్కువగా ఉంది. గత ఐదు సెషన్లలో బంగారం ధరలు దాదాపు రూ.2000కు పైగా క్షీణించింది. వెండి ధరలు కూడా నేడు ఉదయం స్వల్పంగా పెరిగినప్పటికి, సాయంత్రం సెషన్లో తగ్గాయి. కిలో రూ.69,000 దిగువకు వచ్చింది. ఇటీవల ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. అదే సమయంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి.

<strong>కరోనా ఎఫెక్ట్: లాక్‌డౌన్ తర్వాత పెన్షనర్లకు ఎన్నో ప్రయోజనాలు</strong>కరోనా ఎఫెక్ట్: లాక్‌డౌన్ తర్వాత పెన్షనర్లకు ఎన్నో ప్రయోజనాలు

రూ.46,200 దిగువకు బంగారం

రూ.46,200 దిగువకు బంగారం

ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు స్వల్పంగా తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.53.00 (0.11%) తగ్గి రూ.46,184.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,409.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,498.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,011.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.58.00 (-0.13%) తగ్గి రూ.46,330 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,571.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,655.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,188.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

69,000 దిగువకు వెండి

69,000 దిగువకు వెండి

వెండి ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. ఉదయం రూ.69,000 పైకి చేరుకున్నప్పటికీ, ఆ తర్వాత తగ్గింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.631.00 (-0.91%) తగ్గి రూ.68,600.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,400.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,639.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,270.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.673.00 (-0.96%) క్షీణించి రూ.69,710.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,682.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,682.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,491.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1775 డాలర్ల దిగువకు పసిడి

1775 డాలర్ల దిగువకు పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగినప్పటికీ, 1800 డాలర్లకు దిగువనే ఉంది. అయితే ఉదయం కంటే తగ్గింది. ఉదయం సెషన్లో 0.5 శాతం మేర లాభపడిన గోల్డ్ సాయంత్రం సెషన్‌కు 0.07 మాత్రమే ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1.20 (0.07%) డాలర్లు పెరిగి 1774.00 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,766.95 - 1,788.55 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 9.58 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం తగ్గింది. ఔన్స్ ధర 0.253 (0.93%) డాలర్లు తగ్గి 27.062 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.913 - 27.595 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 49.87 శాతం పెరిగింది.

English summary

రూ.10,000 కంటే ఎక్కువ డౌన్: రూ.46,000 వద్ద బంగారం ధరలు, వెండి రూ.68,000 దిగువకు | Gold prices today down to Rs 46,200: silver below Rs 69,000

Gold and silver futures prices recovered on Thursday following the trend in the international market, thanks to drop in the bond yield. But rising inflation in the US provided some support.
Story first published: Thursday, February 18, 2021, 22:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X