For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గతవారం స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు 4.69% జంప్

|

గతవారం బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. అయితే వెండి ధరలు మాత్రం దాదాపు ఐదు శాతం మేర పెరిగాయి. బంగారం ధరలు క్రితం వారం అతి స్వల్పంగా రూ.34 లేదా 0.07 శాతం నష్టపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధరలు గత నాలుగు సెషన్లలో రెండు సెషన్లలో తగ్గగా, మరో రెండు సెషన్లలో పెరిగాయి. గత వారం కామెక్స్ గోల్డ్ 5.9 డాలర్లు లేదా 0.32 శాతం తగ్గింది. అమెరికా అధ్యక్షులు జోబిడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల కరోనా రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్రభావం ఈ సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై పడింది.

చివరి సెషన్లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 482.00 (0.99%) పెరిగి రూ.49,106.00 వద్ద ముగిసింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7100కు పైగా తక్కువ ఉంది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 394.00 (0.81%) పెరిగి రూ.49,330.00 వద్ద ముగిసింది. వెండి భారీగా షాకిచ్చింది. ఏకంగా రూ.2170 పెరిగింది. ఓ సమయంలో రూ.71,000 క్రాస్ చేసింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 2,170.00 (3.21%) పెరిగి రూ.69765.00 వద్ద ముగిసింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.2,338.00 (3.41%) పెరిగి రూ.70900.00 వద్ద ముగిసింది.

Gold prices steady this week, silver soars 4.69 percent on retail frenzy

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర నిన్న ఓ సమయంలో 1860 డాలర్ల పైకి చేరినప్పటికీ, చివరకు 1850 డాలర్ల దిగువ ముగిసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ మొదట్లో 40 డాలర్ల వరకు పెరిగింది. కానీ 8 డాలర్ల పెరుగుదలతో ముగిసింది. నిన్నటి సెషన్లో ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 8.40 (+0.46%) పెరిగి 1,849.60 డాలర్ల వద్ద ముగిసింది. ఆ సెషన్లో 1,841.15 - 1,878.80 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.83% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 1.138 (+4.39%) డాలర్లు పెరిగి 27.060 డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 26.152 - 27.765 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 49.12శాతం పెరిగింది.

English summary

గతవారం స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు 4.69% జంప్ | Gold prices steady this week, silver soars 4.69 percent on retail frenzy

Gold prices edged higher to Rs 49,330 per 10 gram on January 29 as participants widened their positions as seen by the open interest. The precious metal ended with a marginal loss of Rs 34 or 0.07 percent for the week.
Story first published: Sunday, January 31, 2021, 18:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X