For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాకిచ్చిన బంగారం ధర, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం రివర్స్

|

కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మృతుల సంఖ్య దాదాపు 55వేలకు చేరుకోవడం కూడా ఆందోళన కలిగిస్తుంది. కరోనా ప్రభావం బంగారం పైన ప్రభావం చూపుతోంది. ఓ సమయంలో సురక్షిత పెట్టుబడిగా భావిస్తు ఇన్వెస్ట్ చేస్తుంటే, మరోసారి చేతికి నగదు తీసుకుంటున్నారు. దీంతో బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. మార్చి నెలలో రూ.45వేల రికార్డ్ ధరతో పాటు రూ.40వేల దిగువకు కూడా చేరుకుంది.

సూపర్: Forbes 30 అండర్ 30 లిస్ట్‌లో 5గురు హైదరాబాదీలు, కేటీఆర్ అభినందనసూపర్: Forbes 30 అండర్ 30 లిస్ట్‌లో 5గురు హైదరాబాదీలు, కేటీఆర్ అభినందన

పెరిగిన బంగారం ధర

పెరిగిన బంగారం ధర

శుక్రవారం బంగారంతో పాటు వెండి ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 10.2 శాతం (రూ.441) పెరిగి రూ.43,681గా ఉంది. వెండి కిలో 3.05 శాతం (రూ.1,218) పెరిగి రూ.41,090 పలికింది. ఇండియన్ స్పాట్ గోల్డ్ మార్కెట్లు లాక్ డౌన్ నేపథ్యంలో క్లోజ్ చేసి ఉన్నాయి.

హైదరాబాద్‌లో గత పదిరోజుల్లో ధరలు..

హైదరాబాద్‌లో గత పదిరోజుల్లో ధరలు..

మొత్తంగా గత పది రోజుల్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టినట్లే. ఉదాహరణకు హైదరాబాదులో మార్చి 25న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.44,630గా ఉంటే 22 క్యారెట్ల బంగారం 41,080గా ఉంది. ఏప్రిల్ 1న 24 క్యారెట్ల బంగారం రూ.43,080 22 క్యారెట్ల బంగారం రూ.39,440గా ఉంది. నేడు 24 క్యారెట్ల బంగారం రూ.43,300, 22 క్యారెట్ల బంగారం రూ.39,750గా ఉంది. అంటే పది రోజుల క్రితంతో పోలిస్తే దాదాపు రూ.1500 తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధర

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధర

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. డాలర్ వ్యాల్యూ గత సెషన్‌లో 1.4 శాతం పెరిగింది. ఈ ప్రభావం బంగారంపై పడింది. స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి ఔన్స్ ధర 1,610.64 పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి 1,635.50 పలికింది. బంగారం ఈ వారం 0.4 శాతం పడిపోగా, గత వారం 8 శాతం పెరిగింది.

ఇతర ఖరీదైన లోహాలు..

ఇతర ఖరీదైన లోహాలు..

ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే పల్లాడియం 0.8 శాతం తగ్గి ఔన్స్ 2,196.39 డాలర్ల వద్ద, ప్లాటినమ్ 0.2 శాతం తగ్గి ఔన్స్ 725.52 డాలర్ల వద్ద, వెండి 0.8 శాతం తగ్గి ఔన్స్ 14.42 పలికింది. ఈ వారం ఈ మూడు మెటల్స్ కూడా తగ్గాయి.

English summary

షాకిచ్చిన బంగారం ధర, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం రివర్స్ | Gold prices shoot up today as rising Covid cases lead to flight to safety

Gold and silver prices leaped on Friday as rapid increase in coronavirus cases hit the risk appetite of investors, leading to rise in demand of safe haven assets even as the rupee gained against the US dollar.
Story first published: Friday, April 3, 2020, 17:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X