For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: 2 వారాలు తగ్గిన తర్వాత.. బంగారం మరింత పడిపోనుందా?

|

ముంబై: బంగారం ధరలు గతవారం క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్ రూ.47,000 దిగువకు పడిపోయాయి. అమెరికా ట్రెజరీ యీల్డ్స్ పెరగడం, యూఎస్ డాలర్ పుంజుకున్న నేపథ్యంలో బంగారంపై ఒత్తిడి తగ్గింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం రూ.47,000 నుండి రూ.47,500 మధ్య కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్లో 1780 డాలర్ల నుండి 1830 డాలర్ల మధ్య కనిపించింది. అయితే ఈ వారం మళ్లీ పెరుగుదలతో ప్రారంభమైంది. ఎంసీఎక్స్‌లో బంగారం గతవారంలోని ఐదు సెషన్‌లలో నాలుగు సెషన్లు క్షీణించింది. చివరకు వారంలో రూ.700 లేదా 1.50 శాతం నష్టంతో ముగిసింది. కామెక్స్‌లో వారంలో 45 డాలర్లు లేదా 2.50 శాతం క్షీణించింది. బంగారం వరుసగా రెండో వారం క్షీణించింది. ప్రస్తుతం నెల కనిష్టం వద్ద ఉంది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం వారం రూ.46,800 వద్ద ముగిసింది.

గోల్డ్ ఫ్యూచర్ నిరోధకస్థాయి

గోల్డ్ ఫ్యూచర్ నిరోధకస్థాయి

బంగారం ధర ఈ వారం స్వల్ప పెరుగుదలతో ప్రారంభమైనప్పటికీ, క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎంసీఎక్స్ అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నిరోధకస్థాయి రూ.48,431, మద్దతు రూ.45,735. బంగారం ఇటీవల స్వల్ప దిద్దుబాటుకు గురవుతోంది. గత నెలలో రూ.48,000 తాకుతున్నట్లుగా కనిపించిన పసిడి ఇప్పుడు రూ.47,000 దిగువన ట్రేడ్ అవుతోంది.

బంగారంపై ఇలా ఒత్తిడి తగ్గింది

బంగారంపై ఇలా ఒత్తిడి తగ్గింది

అమెరికాలో సెప్టెంబర్ 3వ తేదీతో ముగిసిన వారంలో కొత్త జాబ్-లెస్ బెనిఫిట్ క్లెయిమ్స్ భారీగా తగ్గాయి. కరోనా సమయంలో 3,10,000గా ఉన్న ఈ క్లెయిమ్స్ ఇప్పుడు 35,000కు పడిపోయాయి. అలాగే, డాలర్ వ్యాల్యూ పెరుగుతోంది. డాలర్ వ్యాల్యూ గతవారం 0.18 శాతం పెరిగి 92.64కు చేరుకుంది. గతవారంలో అయితే 0.66 శాతం ఎగిసింది. 92.86తో గరిష్టాన్ని తాకింది. అమెరికా 10 ఇయర్ ట్రెజరీ యీల్డ్స్ భారీగా పుంజుకొని, గతవారంలో 1.343 శాతానికి చేరుకున్నాయి. ఎస్పీడీఆర్ వద్ద గోల్డ్ షేర్లు 1000 టన్నుల దిగువకు పడిపోయాయి. అంతకుముందువారం తగ్గి 998.52 టన్నులకు పడిపోగా, గతవారం మరింత తగ్గి 998.17 క్షీణించాయి. ఇవి రికవరీ సంకేతాలు. ఈ ప్రభావం పసిడిపై కనిపిస్తోంది. దీంతో పసిడి ధరలు తగ్గుతున్నాయి. రాబోయే త్రైమాసికంలో PEPP(పాండమిక్ ఎమర్జెన్సీ బాండ్ పర్చేజింగ్ ప్రోగ్రాం)ను తగ్గిస్తున్నట్లు యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు(ECB) ప్రకటించింది. ఇది కరోనా సమయంలో ఉపయోగపడింది.

నేటి ధరలు

నేటి ధరలు

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.94.00 (0.20%) పెరిగి రూ.46900.00 వద్ద, డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51.00 (0.11%) క్షీణించి రూ.47056.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు రూ.47,000 దిగువనే కొనసాగుతోంది.

గత వారంలో రూ.64,000 క్రాస్ చేసిన సిల్వర్ ఫ్యూచర్స్ వారం ముగిసేసరికి రూ.64,000 దిగువన ముగిసింది. నేడు కూడా స్వల్పంగా క్షీణించింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.182.00 (-0.29%) క్షీణించి రూ.63410.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.201.00 (-0.31%) తగ్గి రూ.64253.00 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.40 డాలర్లు తగ్గి 1,793.50 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. అయినప్పటికీ 1800 డాలర్ల దిగువనే ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ 24 డాలర్ల దిగువనే ఉంది. నేటి సెషన్‌లో 0.118 డాలర్లు తగ్గి 23.782 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

Gold prices today: 2 వారాలు తగ్గిన తర్వాత.. బంగారం మరింత పడిపోనుందా? | Gold prices rise after decline 2nd straight week: indicates further downside

Gold prices fell for the second straight week to settle at Rs 46,806 per 10 gram on rising Treasury yield and firm US dollar.
Story first published: Monday, September 13, 2021, 10:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X