For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగ తర్వాత భారీగా షాకిస్తున్న బంగారం, ఎందుకు పెరుగుతున్నాయంటే?

|

నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు మాత్రం అతి స్వల్పంగా తగ్గాయి లేదా స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి (నవంబర్ 10) ప్రారంభ సెషన్‌‌లో రూ.62.00(0.13%) నష్టపోయి రూ.48225.00 వద్ద, ఫిబ్రవరి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.71.00 (-0.15%) నష్టపోయి రూ.48385.00 వద్ద ట్రేడ్ అయింది. నిన్న రూ.200కు పైగా తగ్గిన సిల్వర్ ఫ్యూచర్స్, నేడు అదే స్థాయిలో పెరిగాయి. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ప్రారంభ సెషన్‌లో రూ.233.00 (0.36%) పెరిగి రూ.64803.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.232.00 (0.36%) పెరిగి రూ.65497.00 వద్ద ట్రేడ్ అయింది.

బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.8000 తక్కువగా ఉంది. వెండి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.15వేలు తక్కువగా ఉంది. బంగారం ధరలు మూడు నెలల గరిష్టం వద్ద ఉన్నాయి. బంగారం ధరలు దీపావళి తర్వాత షాకిస్తున్నాయి.

డాలర్ల వద్ద ప్రారంభం అయినప్పటికీ

డాలర్ల వద్ద ప్రారంభం అయినప్పటికీ

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో నిన్న 1830 డాలర్లు దాటిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఈ స్థాయి దిగువకు వచ్చింది. క్రితం సెషన్‌ 1,830.80 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. నేడు ఏకంగా 1,834.40 డాలర్ల వద్ద ప్రారంభం అయినప్పటికీ, ఆ తర్వాత క్షీణించింది. ప్రారంభ సెషన్‌లో 3.05

(-0.17%) డాలర్లు తగ్గి 1,827.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 1,828.65 - 1,834.40 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ నేడు మరింత పెరిగింది. 0.072 (+0.30%) డాలర్లు లాభపడి 24.390 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెండి ఏడాది కాలంలో 0.9 శాతం తగ్గింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఇదే కాలంలో 2.31 శాతం క్షీణించింది.

నిన్న ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు

నిన్న ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు నిన్న భారీగా పెరిగాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.281.00 (0.59%) పెరిగి రూ.48299.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.324.00 (0.67%) పెరిగి రూ.48480.00 వద్ద క్లోజ్ అయింది. నిన్నటి సెషన్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.261.00 (-0.40%) తగ్గి రూ.261.00 (-0.40%) వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.234.00 (-0.36%) క్షీణించి రూ.65346.00 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో ఓ సమయంలో రూ.48,300 కూడా దాటింది. చివరకు ఆ స్థాయిలోనే క్లోజ్ అయింది.

అందుకే మళ్లీ జంప్

అందుకే మళ్లీ జంప్

డాలర్ వ్యాల్యూ స్థిరంగా ఉన్నప్పటికీ, అమెరికా యీల్డ్స్ క్షీణత బంగారం ధర పెరుగుదలకు దోహదపడిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కార్మిక శాఖ మంగళవారం విడుదల చేసిన యూఎస్ పీపీఐ నివేదిక ప్రకారం టోకు ద్రవ్యోల్భణం క్షీణిస్తున్నట్లుగా వెల్లడైంది. యూఎస్ యీల్డ్స్‌లో భారీ పెరుగుదల, పరిమాణాత్మక సడలింపు క్షీణించినప్పుడు వడ్డీ రేటు మారదనే ఫెడ్ వైఖరికి అనుగుణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయని అంటున్నారు.

English summary

పండుగ తర్వాత భారీగా షాకిస్తున్న బంగారం, ఎందుకు పెరుగుతున్నాయంటే? | Gold Prices: Prices Edge Higher Following U.S. PPI Report

Gold prices continued to trend higher after breaking out on Friday. Despite the greenback holding steady, the decline in U.S. yields buoyed the yellow metal.
Story first published: Wednesday, November 10, 2021, 10:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X