For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price News: దిగివస్తున్న బంగారం ధరలు.. 11 నెలల కనిష్ఠానికి.. ఇంకెంత తగ్గుతాయంటే..

|

Gold Price News: బంగారం ప్రియులకు ప్రస్తుతం కలిసొచ్చే కాలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికాలో జరుగుతున్న ఆర్థిక మార్పుల కారణంగా బంగారం ధరలు పతనం అవుతున్నాయి. తాజాగా బంగారం ధర 11 నెలల కనిష్ఠానికి క్షీణించాయి. అయితే ఇవి మరింతగా తగ్గే అవకాశాలు కొంత మేర ఉన్నట్లు నిపుణులు అంటున్నారు. డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్ కర్వ్ ఇన్వెర్ట అవ్వటం, ఫెడ్ వడ్డీ రేట్లను మరో 100 బేసిస్ పాయింట్లు ఈ నెలలో పెంచవచ్చని వార్తల మధ్య గోల్డ్ తన మెరుపును కోల్పోయింది.

భారతీయులకు శుభవార్త..

భారతీయులకు శుభవార్త..

రాబడి ఇవ్వని పసిడిలో పెట్టుబడులకు చాలా మంది ఇన్వెస్టర్లు దూరంగా జరుగుతున్నారు. కానీ.. ఇక్కడ భారతీయులకు కలిసొచ్చే అంశం ఒకటి ఉందని మనం గమనించాలి. అదేంటంటే.. బంగారాన్ని పెట్టుబడి కోసం కాకుండా ఆభరణాలను కొనుగోలు చేయాలనుకునే సగటు భారతీయునికి ఇది సరైన సమయం అని చెప్పుకోవాలి. పైగా ప్రస్తుతం తక్కువలో కొనుగోలు చేసిన బంగారాన్ని అవసరమైతే భవిష్యత్తులో విలువ పెరిగినప్పుడు తిరిగి అమ్మేసుకోవచ్చు కూడా. దీని వల్ల స్వల్ప కాలంలోనే మంచి రాబడిని కూడా పొందవచ్చు.

బంగారం ధరలు ఇలా..

బంగారం ధరలు ఇలా..

అంతర్జాతీయ బంగారం ధరలు ప్రస్తుతం దాదాపు 11 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. విలువైన పసిడి ఔన్సు ధర దాదాపుగా 1,710 డాలర్లకు చేరుకుంది. స్పాట్ వెండి ధర కూడా తగ్గటంతో.. ఔన్స్ సుమారు 18.76 డాలర్లకు చేరుకుంది. మన దేశంలో ఇటీవల బంగారం దిగుమతులపై టాక్స్ పెంచిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా బంగారం, వెండితో పాటు ఆభరణాలను నియంత్రిత డెలివరీ జాబితాలో చేర్చింది. దీని వల్ల వీటిని ఎగుమతి చేయాలన్నా లేదా దిగుమతి చేసుకోవలన్నా సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందటం తప్పనిసరి.

కరోనా ముందు స్థాయికి బంగారం రేట్లు..

కరోనా ముందు స్థాయికి బంగారం రేట్లు..

బంగారం 11 నెలల కనిష్ఠాల వద్ద ట్రేడ్ అవుతోంది. ఔన్స్ ప్రస్తుతం 1,675 డాలర్ల కంటే తక్కువ నష్టాన్ని కలిగి ఉంది. USDలో బలంతో పాటు బంగారం ధరలు తగ్గడానికి మరో అంశం ముడి చమురు ధరలు తగ్గడం అని చెప్పుకోవచ్చు. బంగారం ధర ఇంతకంటే తగ్గి కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటే గోల్డ్ ఇన్వెస్టర్లు వారి వద్ద ఉండే బంగారాన్ని అమ్మేస్థారని నిపుణులు అంటున్నారు. ఇదే గనుక జరిగితే బంగారం ధర సామాన్యులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. పైగా పండుగల సీజన్ దగ్గర పడటంతో బంగారం ధర దిగిరావటం రిటైల్ గిరాకీ పెరిగేందుకు దారితీస్తుందని వ్యాపార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

English summary

Gold Price News: దిగివస్తున్న బంగారం ధరలు.. 11 నెలల కనిష్ఠానికి.. ఇంకెంత తగ్గుతాయంటే.. | gold prices fell to 11 months lows internationally amid strog us dollar and fed rate hike news

International gold prices today fell to near 11-month lows. is still it goes low know details
Story first published: Saturday, July 16, 2022, 7:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X