For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర, ఐదు రోజుల్లో పెరిగింది రూ.3,000

|

భారత మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు (బుధవారం 26 ఫిబ్రవరి) తగ్గాయి. ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.7 శాతం (రూ.300) తగ్గి రూ.42,485కు చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో అంటే మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.765 తగ్గింది. మొత్తం రెండు రోజుల్లో రూ.1,065 వరకు తగ్గింది. వెండి ధర కూడా కిలో 1.2 శాతం తగ్గి రూ.47,020గా ఉంది. డాలరు మారకంతో రూపాయి బలపడటంతో సహా వివిధ కారణాలతో బంగారం ధర తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఎంత తగ్గిందంటే

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్‌కు 0.5 శాతం తగ్గి రూ.1,643.49గా ఉంది. అంతకుముందు సెషన్‌లో 1.9 శాతం తగ్గిపోయింది. సోమవారం బంగారం ధర ఔన్స్‌కు 1,688.66కు చేరుకుంది. ఇది ఏడేళ్ల గరిష్టం. అయితే రెండు రోజులుగా ధరలు తగ్గుతున్నాయి. ఒక్క రోజులో రూ.1000 ఎగబాకిన ధర రెండు రోజుల్లో అంతే తగ్గింది. అయితే గత అయిదు రోజుల్లో పదిగ్రాముల బంగారం ఏకంగా రూ. 3000 పెరిగింది.

ఒక్కరోజే రూ.1,000 పెరిగి, నేడు తగ్గిన బంగారం ధర: ధర పెరిగేందుకు దారి తీసే కారణాలుఒక్కరోజే రూ.1,000 పెరిగి, నేడు తగ్గిన బంగారం ధర: ధర పెరిగేందుకు దారి తీసే కారణాలు

Gold prices fall sharply for second day

అయిదు రోజులుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధర పెరుగుదలకు మంగళవారం బ్రేక్ పడినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పడిపోవడంతో పాటు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరలు ఎంసీఎక్స్‌లో మంగళవారం ఒక్కరోజే ఏకంగా రూ.1200 దిగి వచ్చింది.

English summary

రెండు రోజుల్లో భారీగా తగ్గిన బంగారం ధర, ఐదు రోజుల్లో పెరిగింది రూ.3,000 | Gold prices fall sharply for second day

Gold prices in India fell sharply today in Indian markets, extending losses to the second day. On MCX, April gold futures fell 0.7% or about ₹300 to ₹42,485 per 10 gram. The precious metal had fallen ₹765 per 10 gram in the previous session.
Story first published: Wednesday, February 26, 2020, 14:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X