ఈవారం రూ.1200 పెరిగిన బంగారం ధర: రూ.50,250 పైకి చేరకపోవచ్చు!
ముంబై: బంగారం ధరలు గత సెషన్‌లో స్వల్పంగా తగ్గాయి. అయితే రూ.49,000కు పైనే ఉన్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.200కు పైగా పెరిగింది. అంతకుముందు నాలుగు సెషన్‌లలో పసిడి పెరిగిన విషయం తెలిసిందే. మొత్తంగా ఈ వారంలో పసిడి రూ.1200 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోను 1850 డాలర్ల సమీపానికి చేరుకుంది. డాలర్ వ్యాల్యూ ఈ వారం క్షీణించడం, అమెరికా ఆర్థిక ప్యాకేజీపై అంచనాలు వంటి అంశాల వల్ల పసిడి ఎగిసిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.
RBI సెక్యూరిటీ రూల్స్! జనవరి నుండి పిన్ లేకుండా రూ.5,000 వరకు ట్రాన్సాక్షన్స్

ఈ స్థాయిలో బంగారం ధరలు ఉండొచ్చు
సమీపకాలంలో దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉండవచ్చునని భావిస్తున్నారు. రూ.48,000 నుండి రూ.50,250 మధ్య ఉండవచ్చునని అంటున్నారు. ఆగస్ట్ నెలలో 10 గ్రాముల పసిడి రూ.56,200 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో మరికొద్ది రోజులు 1900 డాలర్లకు దిగువనే ఉంటుందని అంటున్నారు.

బంగారం స్వల్పంగా తగ్గి
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో శుక్రవారం 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.93.00 (-0.19%) తగ్గి రూ.49,209.00 వద్ద ముగిసింది. రూ.49,415.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,473.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,029.00 కనిష్టాన్ని తాకింది.
ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.27.00 (-0.05%) క్షీణించి రూ.49225.00 వద్ద ముగిసింది. రూ.49,460.00 ప్రారంభమై, రూ.49,499.00 గరిష్టాన్ని, రూ.49,130.00 కనిష్టాన్ని తాకింది.
మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.218.00 (0.34%) పెరిగి రూ.63848.00 వద్ద ముగిసింది. రూ.63,722.00 ప్రారంభమై, రూ.64,567.00 గరిష్టాన్ని, రూ.63,360.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1.00
(+0.05%) డాలర్లు పెరిగి 1,842.10 డాలర్ల వద్ద, క్లోజ్ అయింది. ఈ సెషన్లో 1,832.65 - 1,851.95 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్లో పసిడి 1841 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో పసిడి 22.2 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.178 (+0.74%) డాలర్లు పెరిగి 24.315 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో సిల్వర్ 42 శాతం పెరిగింది. అంతకుముందు సెషన్లో 24.137 డాలర్ల వద్ద ముగిసింది.