అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినట్లుగా కనిపించడంతో బంగారం ధరలు గురువారం భారీగా తగ్గిపోయాయి. హఠాత్తుగా పెద్ద మొత్తంలో తగ్గింది. ఇరాన్ కీలక కమాండర్ ఖాసీమ్ సోలెమన్‌ను రాకెట్ లాంఛర్లతో హతమార్చిన అనంతరం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్.. అమెరికా కార్యాలయాలు లక్ష్యంగా రాకెట్ లాంఛర్లు ప్రయోగించింది. అయితే ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్లకు ఊరటనివ్వగా, పసిడిపై ఒత్తిడిని తగ్గించాయి.

తగ్గిన బంగారం ధర
ట్రంప్ వ్యాఖ్యల తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గురువారం కూడా అదే బాట పట్టింది. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్ 10 గ్రాములకు ధర 0.8 శాతం తగ్గి రూ.39,789గా ఉంది. అంతకుముందు సెషన్‌లో రూ.600 తగ్గింది. వెండి ధరలు కూడా 1.4 శాతం తగ్గి రూ.46,720కి చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో...
ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 7 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. ఇప్పుడు దిగి వచ్చింది. ఏడేళ్ల తర్వాత 1,600 డాలర్ల కంటే పైకి చేరుకున్న పసిడి ఇప్పుడు తగ్గింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,561కి చేరుకుంది.

రెండ్రోజుల్లో రూ.900 తగ్గుదల
బంగారం ధర రెండు రోజుల్లో రూ.900 తగ్గింది. బంగారం ధర గత ఏడాది సెప్టెంబర్ నెలలో రూ.40 వేల మార్క్ దాటింది. ఇప్పుడు ఇరాన్ - అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ఏకంగా రూ.42వేలకు చేరుకుంది. పరిస్థితులు చల్లబడటంతో ధరలు తగ్గుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications