For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏడాది కనిష్టానికి బంగారం ధరలు, పెరిగిన కొనుగోళ్లు

|

ముంబై: బంగారం ధరలు ఈ వారం చివరి సెషన్లో స్వల్పంగా తగ్గాయి. పసిడి ధరలు 2021 సంవత్సరంలో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటి వరకు 21 శాతం మేర క్షీణించాయి. ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలో పసిడి 50,000 స్థాయిలో ఉంది. ఇప్పుడు రూ.45,000 దిగువకు వచ్చింది. అంటే ఈ రెండు నెలల కాలంలో రూ.5,000కు పైగా క్షీణించింది. పూర్తి వారానికి పసిడి ధరల్లో పెద్దగా మార్పులేదు. క్రితం వారంతో పోలిస్తే రూ.100 మాత్రమే పెరిగింది. అంటే ఈ వారం దాదాపు స్థిరంగా ఉంది. క్రితం సెషన్లో పసిడి రూ.44,271 వద్ద కూడా ట్రేడ్ అయి, దాదాపు ఏడాదిన్నర కనిష్టాన్ని తాకింది. ఆ తర్వాత రూ.500 ఎగిసింది. దీంతో రూ.100 లోపు నష్టంతో ముగించింది. ఇటీవల ధరలు తగ్గడంతో కొనుగోళ్లు పుంజుకున్నాయి.

బంగారం ధరలు స్థిరంగా

బంగారం ధరలు స్థిరంగా

పసిడి ఫ్యూచర్ ఏప్రిల్ ధర నిన్నటి సెషన్లో రూ.94 లేదా 0.21 శాతం క్షీణించి రూ.44,785 వద్ద ముగిసింది. నిన్న రూ.44,741.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.44,785.00 వద్ద గరిష్టాన్ని, రూ.44,271.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూన్ ఫ్యూచర్ రూ.64 తగ్గి రూ.45,124 వద్ద ముగిసింది. రూ.45,112.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.45,149.00 గరిష్టాన్ని, రూ.44,655.00 వద్ద కనిష్టాన్ని తాకింది. అంతకుముందు వారం తగ్గిన ధరలు, ఈ వారం దాదాపు స్థిరంగా ఉన్నాయి.

67వేల దిగువకు వెండి

67వేల దిగువకు వెండి

వెండి ధరలు క్రితం సెషన్లో తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.650.00 (0.96%) తగ్గి రూ.66895.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,200.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,259.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,933.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో రూ.695.00 (-1.01%) తగ్గి రూ.67880.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,335.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,335.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,056.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో పైకి

అంతర్జాతీయ మార్కెట్లో పైకి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్రితం సెషన్లో పెరిగాయి. 1725 డాలర్లను క్రాస్ చేశాయి. నిన్నటి సెషన్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 3.00

(0.17%) డాలర్లు పెరిగి 1725.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,696.65 - 1,727.70 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల పైనే ఉంది. ఔన్స్ ధర 0.183 (0.70%) డాలర్లు పెరిగి 26.010 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.427 - 26.238 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

ఏడాది కనిష్టానికి బంగారం ధరలు, పెరిగిన కొనుగోళ్లు | Gold prices drop near lowest in a year, buying picks up in India

The correction in gold prices has triggered fresh retail interest in India. This however allowed dealers to charge higher premiums. On MCX, gold futures fell to ₹44271 at day's low on Friday, near a one-year low of ₹44,150 they touched earlier in the week.
Story first published: Saturday, March 13, 2021, 13:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X