For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.47,000 దిగువన ముగిసిన బంగారం ధరలు: ఈ వారం పెరిగే అవకాశం

|

బంగారం ధరలు గతవారం భారీగా క్షీణించాయి. గతవారం ఓ సమయంలో ఆల్ టైమ్ గరిష్టంతో దాదాపు రూ.10వేలు తగ్గింది. గతవారం మొత్తానికి గోల్డ్ ఫ్యూచర్స్ క్షీణించి రూ.47,000 దిగువకు పడిపోయింది. ఆదివారం కూడా బహిరంగ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల దిగువనే ముగిశాయి. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల వద్ద ఉంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.68వేల దిగువకు వచ్చింది.

గోల్డ్ ఫ్యూచర్స్ క్షీణత

గోల్డ్ ఫ్యూచర్స్ క్షీణత

క్రితం వారం ఎంసీఎక్స్‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46956.00 వద్ద ముగిసింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47253.00 వద్ద క్లోజ్ అయింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67900.00 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.68991.00 వద్ద ముగిసింది. ఈ నెల ప్రారంభంలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50వేలకు సమీపంలో ఉంది. ఇప్పుడు రూ.47వేల దిగువకు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం వారం 1,781.70 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 26.183 డాలర్ల వద్ద ముగిసింది.

ఫెడ్ అధికారుల హెచ్చరిక

ఫెడ్ అధికారుల హెచ్చరిక

అధిక ద్రవ్యోల్భణం నేపథ్యంలో ఈ వారం బంగారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్భణం సంకేతాల నేపథ్యంలో బంగారం వ్యాపారులు అప్రమత్తంగా ఉన్నారని చెబుతున్నారు. అమెరికా ఫెడ్ నిర్ణయం మిశ్రమ సంకేతాలు ఇచ్చింది. సమీప భవిష్యత్తులో అంచనాల కంటే ఎక్కువ ద్రవ్యోల్భణం పెరగవచ్చునని ఇద్దరు ఫెడ్ అధికారులు హెచ్చరించారు.

బహిరంగ మార్కెట్లో ధరలు

బహిరంగ మార్కెట్లో ధరలు

బంగారం ధరలు బహిరంగ మార్కెట్లో నేడు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.10 పెరిగి, రూ.47,160 వద్ద ట్రేడ్ అయింది. 24 క్యారెట్ల బంగారం చెన్నైలో రూ.48500, ముంబైలో రూ.47160, ఢిల్లీలో రూ.50,310, కోల్‌కతాలో రూ.49,220, బెంగళూరులో రూ.48,110, హైదరాబాద్‌లో రూ.48,110, కేరళలో రూ.48,110, అహ్మదాబాద్‌లో రూ.48,610గా ఉంది.

English summary

రూ.47,000 దిగువన ముగిసిన బంగారం ధరలు: ఈ వారం పెరిగే అవకాశం | Gold prices closed below Rs 47,000 last week, Silver down Rs 12,000 from record high

Gold rates in India today (Sunday) showed a slight increase. The prices of 10-gram 22-carat gold today stand at Rs 46,160, going up by Rs 10 from yesterday when the yellow metal was being sold at Rs 46,150.
Story first published: Sunday, June 27, 2021, 15:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X