For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: బంగారం భారీ షాక్, పసిడి రూ.1,100 జంప్, వెండి రూ.2,500

|

గత ఏడాది(2020) చివరలో కాస్త మురిపించిన బంగారం ధరలు, కొత్త ఏడాదిలో భారీగా పెరుగుతున్నాయి. డిసెంబర్ నెలలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,000 పైన ముగిసినప్పటికీ దాదాపు రెండు వారాలుగా స్థిరంగా ఉంది. అంతకుముందు ఓ సమయంలో రూ.47,500 స్థాయికి దిగి వచ్చింది. ఆ తర్వాత క్రమంగా పెరిగిన ధర చాలా రోజుల పాటు రూ.50,000 వద్ద కదలాడింది. కొత్త ఏడాదిలో భారీగా పెరుగుతూ షాకిస్తున్నాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోల్చితే గత ఏడాది రూ.6200కు పైగా తక్కువతో ముగియగా, ప్రస్తుతం 5,000 వరకు మాత్రమే తక్కువగా ఉంది. ఈ రోజు (సోమవారం, జనవరి 4) ఒక్కరోజే రూ.1,100కు పైగా లేదా 2.24% పెరిగింది.

<strong>ఆదాయ పన్ను క్యాలెండర్ 2021: ముఖ్యమైన ఈ తేదీలు గుర్తుంచుకోండి..</strong>ఆదాయ పన్ను క్యాలెండర్ 2021: ముఖ్యమైన ఈ తేదీలు గుర్తుంచుకోండి..

భారీగా పెరిగిన బంగారం

భారీగా పెరిగిన బంగారం

నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,127.00 (2.24%) పెరిగి రూ.51371.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,300.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,389.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,300.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.5000 వరకు తక్కువగా ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,104.00 (2.20%) పెరిగి రూ.51400.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,550.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,423.00 వద్ద గరిష్టాన్ని, రూ.50,550.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

పసిడి ధర నేడు ఏ స్థాయిలోను తగ్గలేదు. ఉదయం ప్రారంభంలో ఏ ధర అయితే ఉందో అదే కనిష్టం. అంటే మధ్యాహ్నం, సాయంత్రం సెషన్.. ఇలా ఏ సమయంలోను తగ్గలేదు.

వెండి రూ.2500 జంప్

వెండి రూ.2500 జంప్

కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 2,431.00 (3.57%) పెరిగి రూ.70554.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,499.00 వద్ద ప్రారంభమై, రూ.70,732.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,499.00 వద్ద కనిష్టాన్ని తాకింది. బంగారం ధర ప్రారంభంలోనే రూ.70,000 దాటింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా భారీగానే పెరిగింది. రూ.2,532.00 (3.67%) క్షీణించి రూ.71600.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,667.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,600.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,234.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో 1950 డాలర్ల దిశగా

అంతర్జాతీయ మార్కెట్లో 1950 డాలర్ల దిశగా

కొత్త ఏడాది 2021లో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ 1900 డాలర్లు క్రాస్ చేసి, 1950 డాలర్ల దిశగా సాగుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 43.25

(+2.28%) డాలర్లు పెరిగి 1,938.15 డాలర్లు పలికింది. నేటి సెషన్లో 1,908.25 - 1,947.95 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 21.47% శాతం పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర +1.085 (+4.11%) డాలర్లు పెరిగి +1.085 (+4.11%) డాలర్ల వద్ద ముగిసింది. నేటి సెషన్లో 26.802 - 27.758

డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 48.5 శాతం పెరిగింది.

English summary

Gold prices today: బంగారం భారీ షాక్, పసిడి రూ.1,100 జంప్, వెండి రూ.2,500 | Gold prices climb above Rs 51,000, silver rises Rs 2,000

Gold prices climbed by Rs 894 to Rs 51,192 per 10 gram in the Mumbai retail market on a softer dollar and positive global cues, but the gains were capped by a stronger rupee.
Story first published: Monday, January 4, 2021, 22:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X