For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price: అమెరికా జాబ్ డేటా ఎఫెక్ట్, భారీగా పెరిగిన బంగారం ధర

|

బంగారం ధరలు దాదాపు స్థిరంగా ముగిశాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం వారం రూ.57,500 పైన ప్రారంభమై, భారీగా తగ్గి, ఆ తర్వాత పెరిగి, దాదాపు అదే స్థాయిలో ముగిశాయి. క్రితం సెషన్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.496.00 (1.06%) పెరిగి రూ.496.00 (1.06%) వద్ద ముగిసింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.471.00 (1.00%) పెరిగి రూ.47610.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో దాదాపు రూ.2000 పెరిగింది. ఓ సమయంలో రూ.62,000 స్థాయికి పడిపోయిన డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో రూ.1,869.00 (2.95%) పెరిగి రూ.65154.00 వద్ద ముగిసింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,869.00 (2.95%) పెరిగి రూ.65154.00 వద్ద ట్రేడ్ క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఏకంగా 1830 డాలర్ల పైకి చేరుకున్నాయి. చివరి సెషన్‌లో 18.75 డాలర్లు లాభపడి 1830.25 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.879 డాలర్లు ఎగిసి 24.797 డాలర్ల వద్ద ముగిసింది.

బంగారం ధరలు గతవారం నాలుగు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. యూఎస్ జాబ్ డేటా సంకేతాలు సానుకూలంగా లేకపోవడం బంగారానికి కలిసి వచ్చింది. యూఎస్ జాబ్ డేటా అంచనాలు భారీగా ఉండగా, ఈ అంచనాలు మిస్ అయ్యాయి. దీంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. స్పాట్ గోల్డ్1.1 శాతం ఎగిసి 1829.77 డాలర్లకు పెరిగింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతానికి పైగా పెరిగింది. యూఎస్ జాబ్ డేటా ప్రకారం ఆగస్ట్ నెలలో 235,000 కొత్తగా ఉద్యోగాలు జత కలిశాయి. గత ఏడు నెలల కాలంలో ఇది కనిష్టం కావడంతో పాటు ఆర్థికవేత్తల అంచనాలను అందుకోలేకపోయింది. అదే సమయంలో అమెరికా డాలర్ కూడా క్షీణించింది. ఇది బంగారం పరుగుకు ఉపయోగపడింది.

Gold price: Yellow metal rises to 4 week high on US jobs data miss

2021లో బంగారం ఒత్తిడిలో కనిపిస్తోంది. 2021లో దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో రూ.50,000 వద్ద ప్రారంభమైన గోల్డ్ తర్వాత రూ.44,000 దిగువకు పడిపోయి, ఇటీవల చాలాకాలంగా రూ.47,000 నుండి రూ.48,000 మధ్య ట్రేడ్ అవుతోంది. ఇటీవలి అమెరికా జాబ్ డేటా అక్కడ కోవిడ్ 19 డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తిస్తోందనేందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. బంగారం ధరలు ప్రస్తుతానికి పెరిగినప్పటికీ ఈ వారం కాస్త ఒత్తిడికి గురి కావొచ్చునని చెబుతున్నారు. గత ఏడాది కాలంగా బంగారం 1700 డాలర్ల నుండి 1900 డాలర్ల మధ్య కదలాడుతోంది.

English summary

Gold price: అమెరికా జాబ్ డేటా ఎఫెక్ట్, భారీగా పెరిగిన బంగారం ధర | Gold price: Yellow metal rises to 4 week high on US jobs data miss

Gold prices jumped to a four-week high after a key report showed the US economy added fewer jobs than forecast, diminishing the possibility that the Federal Reserve will taper stimulus soon.
Story first published: Sunday, September 5, 2021, 11:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X