For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధర: పసిడి రూ.875, వెండి రూ.2,000 డౌన్

|

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. పసిడి, వెండి ధరలు నేడు భారీగా పడిపోయాయి. గత రెండు వారాల్లో దాదాపు రూ.2వేలు క్షీణించిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా పెరిగింది. కానీ ఆ తర్వాత పతనమైంది. రూ.50,000 దిగువకు రావడమే కాదు... 49,500 స్థాయి కంటే తక్కువ పలికింది. ఆగస్ట్ 6వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో దాదాపు రూ.7,000 తక్కువ పలికింది. చాన్నాళ్లకు ఈ తగ్గింపు కనిపించింది. రెండు నెలల పాటు రూ.49,500 నుండి రూ.52,000 మధ్య ట్రేడ్ అవుతూ వస్తోన్న పసిడి నేడు అంతకంటే కిందకు దిగడం గమనార్హం.

రూ.875 తగ్గుదల

రూ.875 తగ్గుదల

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో సాయంత్రం గం.10 సమయానికి 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.874(-1.74%) తగ్గి రూ.49,338.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,234.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.50,350.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,326.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఫిబ్రవరి ఫ్యూచర్స్ దాదాపు రూ.900 క్షీణించింది. ఫిబ్రవరి గోల్డ్ రూ.896.00 (-1.78%) తగ్గి రూ.49,330.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.50,231.00 వద్ద ప్రారంభమై, రూ.50,350.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,325.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.2,000 డౌన్

వెండి రూ.2,000 డౌన్

వెండి ఫ్యూచర్స్ రూ.2,000 వరకు తగ్గింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.1,922.00 (-3.09%) తగ్గి రూ.60,236.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,119.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.62,300.00 వద్ద గరిష్టాన్ని, రూ.60,160.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,925.00 (-3.01%) క్షీణించి రూ.62,050.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,985.00 వద్ద ప్రారంభమై, రూ.64,161.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,008.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో భారీ తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్లో భారీ తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు భారీగా క్షీణించాయి. ఈరోజు ఔన్స్ పసిడి 42.85 (-2.29%) డాలర్లు క్షీణించి 1829.55 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 1,828.40 - 1,875.05 మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1,872.40 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. పసిడి ఏడాదిలో 25 శాతానికి పైగా పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ 0.813 (-3.34%) డాలర్లు క్షీణించి 23.550 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 23.462 - 24.455 మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.363 వద్ద ట్రేడ్ అయిన వెండి ఇప్పుడు 24 డాలర్ల దిగువకు వచ్చింది. ఏడాదిలో 41 శాతం పెరిగింది.

English summary

గుడ్‌న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధర: పసిడి రూ.875, వెండి రూ.2,000 డౌన్ | Gold price today: Yellow metal today fall, trade below Rs 50,000 mark

Gold was trading lower at around Rs 49,350 per 10 gm in the Indian market on November 23, tracking a positive trend in international spot prices.
Story first published: Monday, November 23, 2020, 22:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X