For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: రూ.52,000 దాటిన బంగారం ధరలు

|

బంగారం ధరలు చివరి సెషన్‌లో భారీగా పెరిగాయి. గతవారం ప్రారంభంలో తగ్గుతున్నట్లుగా కనిపించిన పసిడి ధరలు అంతలోనే పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో ఓ సమయంలో ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లకు సమీపానికి (2060 డాలర్లు దాటి) వెళ్లిన పసిడి ఆ తర్వాత 1920 డాలర్ల దిగువకు వచ్చి ఊరటను ఇచ్చింది.

అంటే ఆల్ టైమ్ గరిష్టంతో 155 డాలర్ల మేర తక్కువకు పడిపోయింది. కానీ ఇప్పుడు 120 డాలర్ల మేర తక్కువగా ఉంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్‌లోను రూ.51,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్ ఇప్పుడు రూ.52,000 క్రాస్ చేసి, రూ.52,500 దిశగా కనిపిస్తోంది.

Gold price today: Yellow metal rises last week

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.202 పెరిగి రూ.52,099 వద్ద, ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.171 పెరిగి రూ.52,338 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్ కూడా పెరిగింది. అయినప్పటికీ రూ.67,000 స్థాయిలోనే ఉంది. చివరి సెషన్లో మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.267 పెరిగి రూ.67,032 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.241.00 పెరిగి రూ.67,759 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ సిల్వర్ క్రితం సెషన్‌లో 10 డాలర్లకు పైగా ఎగిసి 1948 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.172 డాలర్లు ఎగిసి 24.907 డాలర్ల వద్ద ముగిసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో గోల్డ్ ఫ్యూచర్స్ 2060 డాలర్ల పైకి చేరుకుంది. కానీ యుద్ధం కాస్త తగ్గాక ధరలు క్షీణించాయి. అయితే ఇటీవల చమురు ధరలు పెరగడం, చైనాలో కరోనా కేసులు, ద్రవ్యోల్భణ ఆందోళనలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.

English summary

Gold price today: రూ.52,000 దాటిన బంగారం ధరలు | Gold price today: Yellow metal rises last week

The latest data from MCX indicates that gold futures, which are set to mature on 3 June this year, rose by 0.39 percent to Rs 52,099.00. While, Silver futures also witnessed a rise of 0.40 percent to reach Rs 67,032.00.
Story first published: Sunday, April 10, 2022, 12:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X