For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండ్రోజుల్లో రూ.1000 పెరిగిన బంగారం ధర, ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9800 తక్కువ

|

ముంబై: బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. నిన్న రూ.46వేలు క్రాస్ చేసిన గోల్డ్ ఫ్యూచర్స్ నేడు దాదాపు స్థిరంగా ఉంది. ప్రారంభ సెషన్లో రూ.50 వరకు పెరిగినప్పటికీ, ఆ తర్వాత స్థిరంగా ఉంది. వెండి కిలో రూ.200కు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1750 డాలర్లకు సమీపంలో ఉంది. వెండి 26 డాలర్ల దిశగా వెళ్తోంది. రిటైల్ మార్కెట్లో రెండు రోజుల్లో పసిడి రూ.1000 వరకు పెరిగింది. గత నెలలో ఆల్ టైమ్ గరిష్టంతో రూ.12,400 తక్కువగా ఉన్న పసిడి, ఇప్పుడు 9,800 తక్కువగా ఉంది. ఈ కాలంలో పసిడి దాదాపు రూ.రూ.2500 పెరిగింది.

భారీగా పెరిగి నేడు స్థిరంగా బంగారం ధరలు

భారీగా పెరిగి నేడు స్థిరంగా బంగారం ధరలు

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. రూ.15.00 (0.03%) పెరిగి రూ.46,377.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,299.00 ప్రారంభమైన ధర, రూ.46,412.00 గరిష్టాన్ని, రూ.46,240.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47.00 (0.10%) పెరిగి రూ.46650.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,586.00 ప్రారంభమైన ధర, రూ.46,650.00 గరిష్టాన్ని, రూ.46,558.00 కనిష్టాన్ని తాకింది.

స్వల్పంగా పెరిగిన వెండి

స్వల్పంగా పెరిగిన వెండి

వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.216.00 (1.32%) పెరిగి రూ.66850.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,400.00 వద్ద ప్రారంభమై, రూ.67,010.00 గరిష్టాన్ని, రూ.66,360.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.272.00 (0.40%) పెరిగి రూ.67872.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,406.00 ప్రారంభమైన ధర, రూ.67,977.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,313.00 కనిష్టాన్ని తాకింది.

1750 డాలర్ల దిశగా...

1750 డాలర్ల దిశగా...

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి. +1.85 (+0.11%)డాలర్లు తగ్గి 1,743.45 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,733.65 - 1,746.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. 25 డాలర్లకు పైనే ఉంది. 0.090 (0.36%) డాలర్లు తగ్గి 25.337 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.023 - 25.477 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

రెండ్రోజుల్లో రూ.1000 పెరిగిన బంగారం ధర, ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9800 తక్కువ | Gold Price Today: Yellow metal prices increase by Rs 1,000

Continuing its upward trend, gold price went up by Rs 1,000 per 100 gram on Thursday (April 8). Gold price has remained quite volatile in the last two-three months with the price peaking February and then registering a fall in March. In April, the gold price has again started to increase.
Story first published: Thursday, April 8, 2021, 12:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X